Share News

TDP: సీనియర్ నేతలతో చంద్రబాబు భేటీ

ABN , Publish Date - Feb 07 , 2024 | 01:53 PM

Andhrapradesh: సీనియర్ నేతలతో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు బుధవారం ఉండవల్లి నివాసంలో సమావేశమయ్యారు. టీడీపీ ఏపీ అధ్యక్షులు అచ్చెన్నాయుడు, కళా వెంకట్రావు, రామానాయుడు, ఎమ్మెల్యే స్వామి తదితరులు అధినేతతో భేటీ అయ్యారు.

TDP: సీనియర్ నేతలతో చంద్రబాబు భేటీ

అమరావతి, ఫిబ్రవరి 7: సీనియర్ నేతలతో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు (TDP Chief Chandrababu Naidu) బుధవారం ఉండవల్లి నివాసంలో సమావేశమయ్యారు. టీడీపీ ఏపీ అధ్యక్షులు అచ్చెన్నాయుడు (AP TDP Chief Atchannaidu), కళా వెంకట్రావు (Kala Venkatrao), రామానాయుడు (Ramanaidu), ఎమ్మెల్యే స్వామి (MLA Swamy)తదితరులు అధినేతతో భేటీ అయ్యారు. చంద్రబాబు ఢిల్లీ పర్యటన, బీజేపీతో పొత్తు తదితర అంశాలపై సీనియర్ నేతలతో టీడీపీ చీఫ్ చర్చిస్తున్నారు.

నేడు హస్తినకు బాబు

కాగా.. ఈరోజు చంద్రబాబు హస్తినకు పయనంకానున్నారు. ఈరోజు రాత్రి కేంద్ర హోంమంత్రి అమిత్ షాను కలిసే అవకాశం ఉంది. ఏపీలో ఎన్నికల్లో పొత్తుల గురించి అమిత్‌ షాతో చంద్రబాబు చర్చించే అవకాశం ఉంది. ఇప్పటికే తెలుగుదేశం - జనసేన పార్టీలు పొత్తులో ఉన్న విషయం తెలిసిందే. జనసేన తమతోనే ఉందని బీజేపీ నేతలు చెబుతున్నారు. మూడు పార్టీలు కలిసి పోటీ చేసేలా ప్రతిపాదనలు వస్తున్నాయి. ఈ వ్యవహారంపై ఇంతకాలం ఎటూ తేల్చకుండా బీజేపీ మౌనం పాటించింది. ఈ నేపథ్యంలో చంద్రబాబు ఢిల్లీ రాకతో పొత్తులపై స్పష్టతనిచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి.

మరిన్ని ఏపీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Updated Date - Feb 07 , 2024 | 01:53 PM