Share News

Chandrababu : వైసీపీ డీఎన్ఏలో శవ రాజకీయం.. సీఎం జగన్‌పై చంద్రబాబు ఫైర్

ABN , Publish Date - Apr 04 , 2024 | 06:30 PM

సీఎం జగన్ (CM Jagan) శవ రాజకీయాలు చేస్తున్నారని ..ఇలా చేయడం ఆయనకు అలవాటుగా మారిందని తెలుగుదేశం జాతీయ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు (Nara Chandrababu Naidu) అన్నారు. ఇప్పుడు మళ్లీ శవరాజకీయాలు చేస్తూ, ముసలివారిని చంపేస్తున్నారని ఆరోపించారు. 2019లో శవ రాజకీయాలు చేసి గెలిచారని విమర్శించారు.

Chandrababu : వైసీపీ డీఎన్ఏలో శవ రాజకీయం.. సీఎం జగన్‌పై చంద్రబాబు ఫైర్

కొవ్వూరు: సీఎం జగన్ (CM Jagan) శవ రాజకీయాలు చేస్తున్నారని ..ఇలా చేయడం ఆయనకు అలవాటుగా మారిందని తెలుగుదేశం జాతీయ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు (Nara Chandrababu Naidu) అన్నారు. ఇప్పుడు మళ్లీ శవరాజకీయాలు చేస్తూ, ముసలివారిని చంపేస్తున్నారని ఆరోపించారు. 2019లో శవ రాజకీయాలు చేసి గెలిచారని విమర్శించారు. మొదట కోడి కత్తి డ్రామా, తర్వాత హు కిల్డ్ బాబాయ్ అని సెటైర్లు వేశారు. కొవ్వూరులో ‘ప్రజాగళం’ బహిరంగ సభలో సీఎం జగన్, వైసీపీ ప్రభుత్వంపై చంద్రబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్ సభలకు 1500 బస్సులను పెట్టి ప్రజలకు డబ్బులు ఇచ్చి తరలిస్తున్నారని ఎద్దేవా చేశారు. జగన్ సభ ప్రారంభం కాగానే జనం వెళ్లిపోతున్నారని విమర్శించారు. రాజకీయం మారుతోందని.. జనంలో ట్రెండ్ మారిందని అన్నారు.

Ganta Srinivasa Rao: పింఛన్ల పంపిణీపై శవ రాజకీయం చేస్తున్న సీఎం జగన్


ఈ ఎన్నికల్లో జగన్ బెండు తీయడం ఖాయమని దెప్పిపొడిచారు. జగన్‌కు ఇంత అహంకారం పనికిరాదన్నారు. ఆయన అహంకారంతో రాష్ట్రాన్ని అంధకారం చేశారని మండిపడ్డారు. పిల్లల భవిష్యత్తు నాశనం చేశారని ఆందోళన వ్యక్తం చేశారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రజల మనిషిని చెప్పారు. రాష్ట్రం బాగుకోసం జనంలోకి పవన్ వచ్చారని చెప్పారు. రాజమండ్రి ఎంపీ అభ్యర్థిగా బీజేపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి పోటీ చేస్తున్నారని గెలిపించాలని కోరారు. తాను ఎండలో ప్రజలు బాగుండాలని వచ్చానని అన్నారు.


Gottipati Ravikumar: పేదలకు పెన్షన్ కోసం ఎందాకైనా పోరాడుతాం...

వైసీపీ డీఎన్ఏలో శవ రాజకీయం ఉందన్నారు. ప్రజలను చంపేసి వారితో శవ రాజకీయాలు చేస్తారని విమర్శించారు. తన తండ్రిని రిలయన్స్ వారే చంపేశారని జగన్ ఓ సమయంలో అన్నారని.. మళ్లీ వారికే ఎంపీ సీటు ఎలా ఇచ్చారని ప్రశ్నించారు. టీడీపీ అధికారంలో ఉంటే ఒకేసారి వెయ్యి రూపాయలు పెన్షన్ పెంచేవాడినని చెప్పారు. జగన్ ముక్కుతూ మూలుగుతూ ఏడాదికి రూ. 250 చొప్పున పెంచాడని మండిపడ్డారు. వలంటీర్ వ్యవస్థకు తాను వ్యతిరేకం కాదన్నారు. టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత వలంటీర్లను కొనసాగిస్తానని స్పష్టం చేశారు. వలంటీర్లు రాజకీయాలు చేయొద్దని సూచించారు. కొంతమంది వైసీపీకి మద్దతుగా ప్రచారం చేస్తున్నారని వారిపై చర్యలు తీసుకుంటామని చంద్రబాబు హెచ్చరించారు.


Bhuvaneswari: కడపలో భువనేశ్వరి పర్యటన.. ఎండను కూడా లెక్క చేయకుండా...

మరిన్ని ఏపీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Updated Date - Apr 04 , 2024 | 06:55 PM