Share News

Chandrababu: సుప్రీంలో నేడు చంద్రబాబు బెయిల్ రద్దు పిటిషన్‌పై విచారణ

ABN , Publish Date - Feb 12 , 2024 | 08:58 AM

నేడు సుప్రీంకోర్టులో స్కిల్ కేసులో చంద్రబాబు బెయిల్ రద్దు పిటిషన్‌పై విచారణ జరగనుంది. స్కిల్ కేసులో హైకోర్టు చంద్రబాబుకి ఇచ్చిన బెయిల్ రద్దు చేయాలంటూ సీఐడీ దాఖలు చేసిన పిటిషన్‌పై అత్యున్నత న్యాయస్థానం విచారణ జరపనుంది.

Chandrababu: సుప్రీంలో నేడు చంద్రబాబు బెయిల్ రద్దు పిటిషన్‌పై విచారణ

ఢిల్లీ: స్కిల్ కేసులో చంద్రబాబు బెయిల్ రద్దు పిటిషన్‌పై నేడు సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది. స్కిల్ కేసులో హైకోర్టు చంద్రబాబుకి ఇచ్చిన బెయిల్ రద్దు చేయాలంటూ సీఐడీ దాఖలు చేసిన పిటిషన్‌పై అత్యున్నత న్యాయస్థానం విచారణ జరపనుంది. జస్టిస్ బేలా ఎం త్రివేది, జస్టిస్ పంకజ్ మిట్టల్‌ల ధర్మాసనం ఈ పిటిషన్‌ను విచారించనుంది. చంద్రబాబుకు బెయిల్‌ మంజూరులో తమ వాదనలు, ఆధారాలను హైకోర్టు పరిగణనలోకి తీసుకోలేదని సీఐడీ తమ పిటిషన్‌లో పేర్కొంది. అలాగే ప్రభుత్వ ధనం దుర్వినియోగం అయిందన్న అంశాన్ని కూడా హైకోర్టు పరిగణలోకి తీసుకోలేదని పిటిషన్‌లో తెలిపింది. దీంతో వెంటనే చంద్రబాబు బెయిల్‌ను రద్దు చేయాలని సుప్రీంకోర్టును ఏపీ సీఐడీ కోరుతోంది. కాగా జనవరి 19న విచారణ సందర్భంగా కౌంటర్ దాఖలుకు సమయం కావాలని చంద్రబాబు తరపు న్యాయవాదులు కోర్టును కోరారు. దీంతో ఇరు పక్షాలు తమ వాదనలను లిఖితపూర్వకంగా సమర్పించాలని సుప్రీం ధర్మాసనం సూచించింది.

Updated Date - Feb 12 , 2024 | 09:08 AM