Share News

AP News: రాజకీయ పార్టీలు ఆ యాప్‌‌ను వినియోగించుకోవాలి: సీఈఓ మీనా

ABN , Publish Date - Mar 26 , 2024 | 10:13 PM

ఏపీ సార్వత్రిక ఎన్నికల్లో రాజీకీయ పార్టీలు ప్రచార అనుమతులు పొందడానికి సువిధా పోర్టల్‌ను వినియో గించుకోవాలని ఏపీ ఎన్నికల ప్రధాన అధికారి ముకేష్ కుమార్ మీనా(Mukesh Kumar Meena) తెలిపారు. రాష్ట్రంలో కోడ్ అమల్లోనున్న నేపథ్యంలో రాజకీయ పార్టీలు, వారి ప్రతినిధులు నిర్వహించే సభలు, సమావేశాలు, ర్యాలీలు, ఊరేగింపులకు అనుమతులకు సువిధా పోర్టల్ ద్వారా తీసుకోవాలని సూచించారు.

AP News: రాజకీయ పార్టీలు ఆ యాప్‌‌ను వినియోగించుకోవాలి:  సీఈఓ మీనా

అమరావతి: ఏపీ సార్వత్రిక ఎన్నికల్లో రాజీకీయ పార్టీలు ప్రచార అనుమతులు పొందడానికి సువిధా పోర్టల్‌ను వినియో గించుకోవాలని ఏపీ ఎన్నికల ప్రధాన అధికారి ముకేష్ కుమార్ మీనా(Mukesh Kumar Meena) తెలిపారు. రాష్ట్రంలో కోడ్ అమల్లోనున్న నేపథ్యంలో రాజకీయ పార్టీలు, వారి ప్రతినిధులు నిర్వహించే సభలు, సమావేశాలు, ర్యాలీలు, ఊరేగింపులకు అనుమతులకు సువిధా పోర్టల్ ద్వారా అనుమతిని తీసుకోవాలని సూచించారు. ఇంటింటి ప్రచారం, కరపత్రాల పంపిణీ, ప్రచార కార్యక్రమాల అనుమతికి కూడా సువిధా పోర్టల్‌ను వినియోగించుకోవాలని కోరారు. 48 గంటలకు ముందుగానే సువిధా యాప్ ద్వారా, నేరుగా అయినా, సంబంధిత రిటర్నింగ్ అధికారికి దరఖాస్తు చేసుకోవాలని అన్నారు.

యాప్‌లో దరఖాస్తు చేసుకున్న 24 గంటల్లోనే అనుమతులు మంజూరు చేస్తామని అన్నారు. ఆన్‌లైన్ నామినేషన్లు, అఫిడవిట్లు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకునేందుకు సువిధా పోర్టల్‌ను ఈసీఐ డిజైన్ చేసిందని తెలిపారు. రాజకీయ పార్టీలు, వారి ప్రతినిధులు అనుసరించాల్సిన విధి విధానాలు, ముందస్తు అనుమతులపై సచివాలయంలో నేడు సమావేశం నిర్వహించినట్లు తెలిపారు. గుర్తింపు పొందిన అన్ని రాజకీయ పార్టీల ప్రతినిధులు ఈ సమావేశంలో పాల్గొన్నారని ముకేష్ కుమార్ మీనా తెలిపారు.

మరిన్ని ఏపీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Updated Date - Mar 26 , 2024 | 10:51 PM