Share News

AP Election 2024: ఆ అధికారులకు సీఈఓ మీనా కీలక ఆదేశాలు

ABN , Publish Date - Mar 17 , 2024 | 04:15 PM

ఏపీలో సార్వత్రిక ఎన్నికల దృష్ట్యా ఎన్నికల కోడ్ అమల్లోకి రావడంతో జిల్లా ఎన్నికల అధికారులకు సీఈవో ముఖేష్ ముమార్ మీనా (CEO Mukesh Mumar Meena) కీలక ఆదేశాలు జారీ చేశారు. అనుమతి లేని రాజకీయ ప్రకటలను వెంటనే తొలగించాలని ఆదేశించారు. ఏపీ వ్యాప్తంగా ఎన్నికల ప్రవర్తనా నియమావళిని పటిష్టంగా అమలు పరచాలని ఆదేశించారు.

AP Election 2024: ఆ అధికారులకు సీఈఓ మీనా కీలక ఆదేశాలు

అమరావతి: ఏపీలో సార్వత్రిక ఎన్నికల దృష్ట్యా ఎన్నికల కోడ్ అమల్లోకి రావడంతో జిల్లా ఎన్నికల అధికారులకు సీఈవో ముఖేష్ ముమార్ మీనా (CEO Mukesh Mumar Meena) కీలక ఆదేశాలు జారీ చేశారు. అనుమతి లేని రాజకీయ ప్రకటలను వెంటనే తొలగించాలని ఆదేశించారు. ఏపీ వ్యాప్తంగా ఎన్నికల ప్రవర్తనా నియమావళిని పటిష్టంగా అమలు పరచాలని ఆదేశించారు. ఇంకా విధుల్లో చేరని ఎన్నికల అధికారులపై తక్షణమే క్రమశిక్షాణా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రభుత్వ కార్యాలయాలు, బహిరంగ స్థలాలల్లో రాజకీయ ప్రకటనలతో ఉన్న హార్డింగ్‌లను, పోస్టర్లు , కటౌట్లను తక్షణమే తొలగించాలని హెచ్చరించారు.

రాష్ట్ర సచివాలయం పరిసర ప్రాంతాలు, కరకట్ట మార్గంలోనూ అనుమతి లేకుండా ఉన్న హార్డింగులను తక్షణమే తొలగించాలని సూచించారు. ఈ మేరకు గుంటూరు జిల్లా కలెక్టర్‌కు సీఈఓ ఆదేశాలు ఇచ్చారు. ఎన్నికల ప్రవర్తనా నియమావళి ప్రకారం ఎన్నికల షెడ్యూలు ప్రకటించినప్ప నుంచి 24 గంటల్లో ప్రభుత్వ కార్యాలయాలల్లో బహిరంగ స్థలానూ 48 గంటల్లో ప్రైవేటు వ్యక్తుల స్థలాల్లోనూ అనుమతి లేకుండా ఉన్న రాజకీయ ప్రకటనలను తొలగించాలని అన్నారు. ఫ్లయింగ్ స్క్వాడ్లు క్షేత్రస్థాయిలో విస్తృతంగా పర్యటిస్తూ ఈ నియమ నిబంధనలను పటిష్టంగా అమలు పర్చేలా చూడాలన్నారు. సీ-విజిల్లో అందే ఫిర్యాదులపై 100 నిమిషాల్లోపు, ఎన్నికల సంఘం నుంచి అందే ఫిర్యాదులపై అదే రోజు, మీడియాలో ప్రచురితమయ్యే ఫిర్యాదులపై 24 గంటల్లోగా చర్యలు తీసుకోవాలని సీఈఓ మీనా ఆదేశించారు.

మరిన్ని ఏపీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Updated Date - Mar 17 , 2024 | 04:16 PM