Share News

Bhimavaram: ఎంపీ రఘురామ ఇంటి ఎదుట బీభత్సం.. కారు అద్దాలు ధ్వంసం చేసి నగదుతో పరార్..

ABN , Publish Date - Jan 14 , 2024 | 04:34 PM

భీమవరంలో వైసీపీ ఎంపీ రఘురామకృష్ణంరాజు ఇంటి వద్ద దుండగులు బీభత్సం సృష్టించారు. ఇంటి ఎందుట పార్క్ చేసి

Bhimavaram: ఎంపీ రఘురామ ఇంటి ఎదుట బీభత్సం.. కారు అద్దాలు ధ్వంసం చేసి నగదుతో పరార్..

భీమవరంలో వైసీపీ ఎంపీ రఘురామకృష్ణంరాజు ఇంటి వద్ద దుండగులు బీభత్సం సృష్టించారు. ఇంటి ఎందుట పార్క్ చేసి ఉన్న కారు అద్దం పగులగొట్టి రూ.4.5 లక్షల నగదు ఎత్తుకెళ్లిపోయారు. పోయిన నగదు పెనుమంట్ర మండలం ఆలమూరుకు చెందిన శ్రీనివాసరాజుదిగా గుర్తించారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. ధ్వంసమైన కారును పరిశీలించారు. ఈ ఘటనతో స్థానికులు ఉలిక్కిపడ్డారు.

కాగా.. రాబోయే ఎన్నికల్లో టీడీపీ జనసేన కూటమి అద్భుత విజయం సాధించబోతుందని వైసీపీ ఎంపీ రఘురామకృష్ణరాజు ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. వైసీపీ నేతలు 99 శాతం పనులు చేశామని చెప్తున్నారు. కానీ అవి చేసిన పనుల గురించి కావు.. చేయని పనుల గురించి. వారి మోసాన్ని ప్రజలు గ్రహించారన్నారు.

Updated Date - Jan 14 , 2024 | 04:35 PM