Share News

AP Politics: కీలక పరిణామం.. మాగుంటతో బాలినేని భేటీ..!

ABN , Publish Date - Jan 26 , 2024 | 02:32 PM

ఒంగోలు వైసీపీ ఎంపీ మాగుంట శ్రీనివాసుల రెడ్డికి టికెట్ ఇవ్వమని వైసీపీ హైకమాండ్ స్పష్టం చేసింది. ఆయన మరో పార్టీలో చేరేందుకు సిద్దం అయ్యారు. మాగుంట కార్యాలయానికి మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస రెడ్డి వచ్చారు. వీరిద్దరి సమావేశం ప్రాధాన్యం సంతరించుకుంది.

AP Politics: కీలక పరిణామం.. మాగుంటతో బాలినేని భేటీ..!

ప్రకాశం: సిట్టింగుల మార్పు, ఇంచార్జీల కేటాయింపుతో ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయాలు (AP Politics) వేడెక్కాయి. సిట్టింగులపై వ్యతిరేకత, ఓటమి భయంతో అధికార వైఎస్ఆర్ సీపీ (YCP) అభ్యర్థులను మారుస్తోంది. టికెట్ రానీ వారు ఇతర పార్టీల వైపు చూస్తున్నారు. ఇటీవల చాలా మంది నేతలు పార్టీని వీడారు. తెలుగుదేశం పార్టీ, జనసేనలో చేరారు. ఒంగోలు వైసీపీ ఎంపీ మాగుంట శ్రీనివాసుల రెడ్డికి వచ్చే ఎన్నికల్లో టికెట్ ఇవ్వమని వైసీపీ హైకమాండ్ స్పష్టం చేసింది. ఆయన మరో పార్టీలో చేరేందుకు సిద్దం అయ్యారు. రామ్ నగర్‌లో గల మాగుంట కార్యాలయానికి మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస రెడ్డి వచ్చారు. వీరిద్దరి సమావేశం ప్రాధాన్యం సంతరించుకుంది.

JAGAN-BALINENI.jpg

హ్యాండిస్తారా..?

వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో బరిలోకి దిగే అభ్యర్థులకు సంబంధించి బాలినేని శ్రీనివాస రెడ్డి వైసీపీ హైకమాండ్‌కు కొన్ని పేర్లను సూచించారు. తన వర్గానికి చెందిన వారికి టికెట్లు కేటాయించాలని మరి మరి కోరారు. సంతనూతలపాడు, కొండపిలో బాలినేని శ్రీనివాస రెడ్డి సూచించిన నేతలకు సీట్లు ఇవ్వలేదు. తర్వాత ఒంగోలు వైసీపీ ఎంపీ టికెట్ మాగుంటకు ఇవ్వాలని బాలినేని శ్రీనివాస రెడ్డి కోరారు. మాగుంట గత 30 ఏళ్ల నుంచి రాజకీయాల్లో ఉన్నారని చెబుతున్నారు. మరోసారి టికెట్ ఇవ్వాలంటున్నారు. బాలినేని సూచించిన ఇద్దరు అభ్యర్థులకు అసెంబ్లీ టికెట్ ఇచ్చేందుకు నిరాకరించింది. మరి మాగుంట విషయంలో హ్యాండ్ ఇవ్వడం ఖాయం అని విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు.

Magunta-Srinivasa-Reddy.jpg

టైమ్ చూసి..!

వైసీపీ అధిష్టానంపై బాలినేని శ్రీనివాస రెడ్డి గుర్రుగా ఉన్నారు. తనకు రెండోసారి మంత్రిగా అవకాశం ఇవ్వకపోవడంతో అసంతృప్తిగా ఉన్నారు. బాలినేని కూడా పార్టీ మారతారనే ప్రచారం జరిగింది. ఇప్పుడు మాగుంటతో భేటీ కావడం రాజకీయ వర్గాల్లో ప్రాధాన్యం సంతరించుకుంది. ఒంగోలు లోక్ సభకు వైసీపీ టికెట్ ఇవ్వకుంటే మరో పార్టీలో చేరేందుకు మాగుంట సిద్దంగా ఉన్నారని తెలిసింది. ఇతర పార్టీ నేతలతో సంప్రదింపులు జరిపారని సమాచారం. సమయం చూసుకుని ఆ పార్టీలో చేరతారని వార్తలు వినిపిస్తున్నాయి.

కాగా.. టీడీపీలో చేరడానికి మాగుంట దాదాపు ముహూర్తం ఫిక్స్ చేసుకున్నారనే ప్రచారం జరుగుతోంది. ఈ పరిస్థితుల్లో ఎంపీతో బాలినేని భేటీ కావడంతో.. మాగుంటను బుజ్జగించారా.. లేకుంటే ఆయనతో కలిసి.. వెంట నడుస్తానన్నారా అనేది తెలియాల్సి ఉంది.

jagan-ycp.jpg

మరిన్ని ఏపీ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి.

Updated Date - Jan 26 , 2024 | 03:04 PM