Share News

Andhra Pradesh: దరఖాస్తు గడువు పెంపు.. ఈ నెల 29 లాస్ట్ డేట్..

ABN , Publish Date - Feb 10 , 2024 | 04:16 PM

ఆంధ్రప్రదేశ్ లో అసెంబ్లీ ఎన్నికలకు ముహూర్తం దగ్గరవుతున్న వేళ ఏపీసీసీ కీలక నిర్ణయం తీసుకుంది. కాంగ్రెస్ అభ్యర్ధుల దరఖాస్తుల స్వీకరణ గడువును పెంచుతున్నట్లు వెల్లడించింది.

Andhra Pradesh: దరఖాస్తు గడువు పెంపు.. ఈ నెల 29 లాస్ట్ డేట్..

ఆంధ్రప్రదేశ్ లో అసెంబ్లీ ఎన్నికలకు ముహూర్తం దగ్గరవుతున్న వేళ ఏపీసీసీ కీలక నిర్ణయం తీసుకుంది. కాంగ్రెస్ అభ్యర్ధుల దరఖాస్తుల స్వీకరణ గడువును పెంచుతున్నట్లు వెల్లడించింది. ఈ నెల 29 వరకు పొడిగించింది. 175 అసెంబ్లీ, 25 పార్లమెంట్ స్ధానాలకు అభ్యర్ధుల నుంచి ఏపీసీసీ దరఖాస్తులు స్వీకరిస్తోంది. అసెంబ్లీకి 175 స్ధానాలకు 810 దరఖాస్తులు, 25 పార్లమెంట్ స్ధానాలకు 110 దరఖాస్తులు వచ్చాయి. దీంతో దరఖాస్తు గడువును మరో 20 రోజుల పాటు పొడిగించి, పోటీ చేసే అభ్యర్ధులు దరఖాస్తు చేసుకోవాలని తెలిపింది.

కాగా.. గత నెల 24 నుంచి అసెంబ్లీ, ఎంపీ స్ధానాలకు పోటీ చేసే ఆశావహుల నుంచి దరఖాస్తులు స్వీకరించింది. ఏపీ వ్యవహారాల ఇన్‌ఛార్జ్ మాణిక్కం ఠాగూర్ విజయవాడలో తొలి అప్లికేషన్‌ తీసుకున్నారు. ఏపీసీసీ అధ్యక్షురాలిగా పదవీ బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి వైఎస్ షర్మిల ఏపీలో కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసే పనిలో నిమగ్నమయ్యారు. అభ్యర్థుల ఎంపికపై కసరత్తు, ఆశావహుల దరఖాస్తుల స్వీకరణ, జిల్లాలలో పార్టీ పరిస్థితితో పాటు నూతన చేరికలు వంటి అంశాలపై ఆమె ప్రత్యేక దృష్టి సారించారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి.

Updated Date - Feb 10 , 2024 | 04:16 PM