Share News

Anganwadis: అంగన్‌వాడీలను విధుల నుంచి తొలగించేందుకు సన్నాహాలు..!

ABN , Publish Date - Jan 21 , 2024 | 11:04 AM

అంగన్‌వాడీలను విధుల నుంచి తొలగించేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. సోమవారం నుంచి అంగన్ వాడీలను విధుల నుంచి తొలగించే అవకాశం ఉంది. ఆందోళన వీడి విధుల్లో చేరిన వారి వివరాలు ఇవ్వాలని కలెక్టర్లను ప్రభుత్వం కోరింది.

 Anganwadis: అంగన్‌వాడీలను విధుల నుంచి తొలగించేందుకు సన్నాహాలు..!

అమరావతి: అంగన్‌వాడీలను ( Anganwadis) విధుల నుంచి తొలగించేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. సోమవారం నుంచి అంగన్ వాడీలను విధుల నుంచి తొలగించే అవకాశం ఉంది. ఆదివారం అందుబాటులో ఉండాలని కలెక్టర్లకు ఆదేశాలు జారీచేసింది. ఆందోళన వీడి విధుల్లో చేరిన వారి వివరాలు ఇవ్వాలని కలెక్టర్లను ప్రభుత్వం కోరింది. 10 శాతం లోపు మాత్రమే డ్యూటీలో చేరారని కలెక్టర్లు ప్రభుత్వానికి నివేదించారు. అంగన్ వాడీల సమాచారం తీసుకొని విధుల నుంచి తొలగించే అవకాశం ఉంది. కాగా.. వేతనాల పెంపు, గ్రాట్యూటీ, మౌలిక వసతుల సదుపాయాల కల్పన, హెల్త్ కార్డులు ఇవ్వడం లేదని అంగన్ వాడీలు ఆందోళనకు దిగిన విషయం తెలిసిందే.

అంగన్‌వాడీలకు ప్రభుత్వం ఇప్పటికే ఎస్మా కింద షోకాజ్ నోటీసులు జారీచేసింది. ఆ నోటీసులకు అంగన్‌వాడీలు సమాధానం ఇచ్చారు. ప్రభుత్వం జారీ చేసిన నోటీసుల్లో అసత్యాలు ఉన్నాయని అంగన్ వాడీలు చెబుతున్నారు. అంగన్‌వాడీలు ఇచ్చిన సమాధానంతో ప్రభుత్వం సంతృప్తి చెందలేదు. తమ వాదనలను వ్యక్తిగతంగా వినాలని అంగన్ వాడీలు కోరారు. అందుకు ప్రభుత్వం నిరాకరించింది. తమ డిమాండ్లను తీర్చాలని అంగన్‌వాడీలు బెట్టుదిగడం లేదు.

మరిన్ని ఏపీ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి.

Updated Date - Jan 21 , 2024 | 09:52 PM