Share News

10TH TOPERS : మార్కుల పంట

ABN , Publish Date - Apr 23 , 2024 | 12:57 AM

ఆరు బంతులకు ఆరు సిక్సర్లు కొట్టిన రవి శాసి్త్ర, యువరాజ్‌ సింగ్‌ను తలపించేలా.. జిల్లా విద్యార్థులు పదో తరగతిలో దాదాపు 600 మార్కును టచ చేశారు. రాష్ట్రస్థాయి ర్యాంకులతో సత్తా చాటుకున్నారు. వ్యవసాయ కుటుంబానికి చెందిన ప్రణతి ఏకంగా 598 మార్కులు సాధించి, రాష్ట్రస్థాయి రెండో ర్యాంకును సొంతం చేసుకుంది. మరికొందరు విద్యార్థులు 596, 595, 594 మార్కులు సాధించారు. కార్పొరేట్‌ స్కూళ్ల విద్యార్థులతో పోటీ పడుతూ.. ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు 590కి పైగా మార్కులు సాధించారు.

10TH TOPERS : మార్కుల పంట
10 TH CLASS EXAM TOPERS

ప్రణతికి రాష్ట్రస్థాయి రెండో ర్యాంకు

600 మార్కులకు ఏకంగా 598

మరికొందరికి 596, 595, 594 మార్కులు

అనంతపురం విద్య, ఏప్రిల్‌ 22: ఆరు బంతులకు ఆరు సిక్సర్లు కొట్టిన రవి శాసి్త్ర, యువరాజ్‌ సింగ్‌ను తలపించేలా.. జిల్లా విద్యార్థులు పదో తరగతిలో దాదాపు 600 మార్కును టచ చేశారు. రాష్ట్రస్థాయి ర్యాంకులతో సత్తా చాటుకున్నారు. వ్యవసాయ కుటుంబానికి చెందిన ప్రణతి ఏకంగా 598 మార్కులు సాధించి, రాష్ట్రస్థాయి రెండో ర్యాంకును సొంతం చేసుకుంది. మరికొందరు విద్యార్థులు 596, 595, 594 మార్కులు సాధించారు. కార్పొరేట్‌ స్కూళ్ల విద్యార్థులతో పోటీ పడుతూ.. ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు 590కి పైగా మార్కులు సాధించారు.


ప్రణతి.. 598

పెనుకొండ మండలం చిన్నరెడ్డిపల్లికి చెందిన తన్నేరు ప్రణతి పదో తరగతిలో 598 మార్కులు సాధించింది. వ్యవసాయ కుటుంబానికి చెందిన సత్యనారాయణరెడ్డి, హేమావతి దంపతుల కూతురు ప్రణతి. అనంతపురం నగరంలోని హౌసింగ్‌ బోర్డ్డు కాలనీ శ్రీచైతన్య పాఠశాలలో చదివింది. ఫస్ల్‌ లాంగ్వేజ్‌లో 100, సెకెండ్‌ లాంగ్వేజ్‌లో 99, థర్డ్‌ లాంగ్వేజ్‌లో 100, గణితంలో 100, సైన్సలో 99, సోషల్‌లో 100 మార్కులు సాధించింది. రాష్ట్రస్థాయి ర్యాంకు సాధించిన తన కూతురు ఐఏఎస్‌ అధికారి కావాలని అనుకుంటోందని, ఆ దిశగా ప్రోత్సహిస్తామని ప్రణతి తండ్రి సత్యనారాయణరెడ్డి తెలిపారు.

గురుకుల విద్యార్థిని సత్తా

గుడిబండలోని ఎంజేపీఏపీబీసీ వెల్ఫేర్‌ రెసిడెన్షియల్‌ గ్లర్స్‌ స్కూల్‌కు చెందిన విద్యార్థిని గోసుల గోపిక 596 మార్కులు సాధించింది. తల్లిదండ్రులు రమేష్‌, అనూష. వీళ్లది ఆత్మకూరు వద్ద ఉన్న తలూపూరు. కదిరేపల్లి వద్ద ఉన్న సెయింట్‌ ఆన్స ఇంగ్లీష్‌ మీడియం స్కూల్‌ కేంద్రంలో పరీక్షలు రాసింది. కార్పొరేట్‌ పాఠశాలల విద్యార్థులను ఢీకొట్టి సత్తా చాటుకుంది.


దూసుకొచ్చిన విద్యార్థులు

జిల్లాలో పలువురు విద్యార్థులు 596 మార్కులు సాధించారు. అనంతపురం నగరంలోని ప్రసాద్‌ స్కూల్‌ విద్యార్థి ఫయాజ్‌ అహ్మద్‌ 596 మార్కులు సాధించాడు. విశ్వభారతి స్కూల్‌ విద్యార్థి లక్ష్యసంహిత 595 మార్కులు సాధించింది. ప్రసాద్‌ స్కూల్‌ చెందిన తనన్యలక్ష్మి 594 మార్కులు, లక్ష్మి సినర్జీ స్కూల్‌ విద్యార్థిని జాష్ణవి 594 మార్కులు, ప్రహల్య 593 మార్కులు సాధించారు.

శారదా టాప్‌ స్కోర్స్‌

అనంతపురంలోని శారద మున్సిపల్‌ హైస్కూల్‌ విద్యార్థులు యోషిత 592 మార్కులు, ఫిర్దోజ్‌ 591 మార్కులు సాధించారు. మున్సిపల్‌ స్కూల్‌ విద్యార్థులు ఈ స్థాయి మార్కులు సాధించడం పట్ల ఉపాధ్యాయులు, అధికారులు హర్షం వ్యక్తం చేశారు.


గగనకు 596 మార్కులు

యల్లనూరు మండలానికి చెందిన నాదెండ్ల గగన 10వ తరగతి పరీక్షల్లో 596 మార్కులు సాధించింది. రాష్ట్రంలో మూడో ర్యాంకుతో సత్తా చాటుకుంది. బుక్కాపురం గ్రామానికి చెందిన నాదెండ్ల శంకర్‌నాయుడు, నిర్మల దంపతుల కూతురు గగన, తాడిపత్రిలోని పద్మవాణి పాఠశాలలో 10వ తరగతి చదివింది. గణితంలో వందకు వంద మార్కులు, మిగిలిన సబ్జెక్టుల్లో 100కు 99 మార్కులు సాధించింది. మైక్రో సాఫ్ట్‌ సీఈఓ సత్య నాదెళ్ల బంధువులు వీరు. ఎంఈఓ చంద్రశేఖర్‌ గగనను అభినందించారు. తల్లిదండ్రులు తమ కుమార్తెకు స్వీటు తినిపించి ఆనందం పంచుకున్నారు.

- యల్లనూరు

బీసీ సంక్షేమం.. టాప్‌

పదో తరగతి పరీక్షల ఫలితాల్లో బీసీ సంక్షేమ పాఠశాలల విద్యార్థులు 98.53 శాతం ఉత్తీర్ణత సాధించారు. ప్రభుత్వ రంగ విద్యాసంస్థల్లో అగ్రస్థానంలో నిలిచారు. ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు 66.15 శాతం ఉత్తీర్ణతతో చివరి స్థానంలో నిలిచారు. బీసీ వెల్ఫేర్‌ స్కూళ్లలో 273 మంది విద్యార్థులు పరీక్షలు రాయగా 269 మంది ఉత్తీర్ణులయ్యారు.


ప్రభుత్వ పాఠశాలల్లో 1,935 మంది విద్యార్థులకుగానూ 1280 మంది పాసయ్యారు. ఎస్సీ వెల్ఫేర్‌ స్కూళ్ల విద్యార్థులు 660 మందికిగాను 638 మంది పాసై.. 96.36 శాతం ఉత్తీర్ణత నమోదు చేశారు. మైనార్టీ వెల్ఫేర్‌ స్కూళ్లలో 237 మందికిగాను 226 మంది పాసై.. 95.36 శాతం ఉత్తీర్ణత నమోదు చేశారు. కేజీబీవీల్లో 1252 మందికిగానూ 1053 మంది విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారు. 84.11 శాతం ఉత్తీర్ణత నమోదైంది. గిరిజన సంక్షేమ పాఠశాలల్లో 190 మందికిగాను 145 మంది పాసై.. 76.32 శాతం, ఎయిడెడ్‌ స్కూళ్లలో 426 మందికిగాను 324 మంది పాసై.. 76.06 శాతం ఉత్తీర్ణత నమోదు చేశారు. మున్సిపల్‌ స్కూళ్లలో 2155 మంది పరీక్షలు రాయగా 1,522 మంది విద్యార్థులు పాసై.. 70.63 శాతం ఉత్తీర్ణత నమోదు చేశారు. జిల్లా పరిషత స్కూళ్లలో 11,453 మంది విద్యార్థులు పరీక్షలు రాయగా 7,800 మంది పాసయ్యారు. 68.10 శాతం ఉత్తీర్ణత నమోదైంది.


అనంత డివిజన పైచేయి..

జిల్లా విద్యాశాఖలో అనంతపురం, గుత్తి డివిజన్లు ఉన్నాయి. పపది ఫలితాల్లో అనంతపురం డివిజన ముందంజలో ఉంది. అనంతపురం డివిజనలో అన్ని మేనేజ్‌మెంట్‌ స్కూళ్ల పరిధిలో 15,206 మంది విద్యార్థులు పరీక్షలు రాయగా 12,682 మంది ఉత్తీర్ణత సాధించారు. 83.40 శాతం ఉత్తీర్ణత నమోదైంది. గుత్తి డివిజన పరిధిలో అన్ని మేనేజ్‌మెంట్ల పరిధిలో 15,687 మంది విద్యార్థులు పరీక్షలు రాయగా 12,321 మంది పాసై.. 78.54 శాతం ఉత్తీర్ణత నమోదు చేశారు.

మరిన్ని అనంతపురం వార్తల కోసం...

Updated Date - Apr 23 , 2024 | 12:57 AM