Share News

Congress: వర్షాలు లేక అనంత రైతు జీవితం ఎండిపోతోంది: శైలజానాథ్

ABN , Publish Date - Mar 31 , 2024 | 12:07 PM

అనంతపురం: జిల్లాకు నాయకులు వస్తున్నారు.. పోతున్నారు...ఎండిన తోటలు, చెట్లు మీకు కనిపించలేదా..? అని ఏపీసీసీ మాజీ అధ్యక్షుడు శైలజానాథ్ ప్రశ్నించారు. అనంతపురం జిల్లా ప్రజల బాధలు అర్థం చేసుకోవాలని, వర్షాలు లేక అనంత రైతు జీవితం ఎండిపోతోందని ఆవేదన వ్యక్తం చేశారు.

Congress: వర్షాలు లేక అనంత రైతు జీవితం ఎండిపోతోంది: శైలజానాథ్

అనంతపురం: జిల్లాకు నాయకులు వస్తున్నారు.. పోతున్నారు...ఎండిన తోటలు, చెట్లు మీకు కనిపించలేదా..? అని ఏపీసీసీ మాజీ అధ్యక్షుడు శైలజానాథ్ (Shailajanath) ప్రశ్నించారు. ఈ సందర్భంగా ఆదివారం అయన అనంతపురంలో మీడియాతో మాట్లాడుతూ.. అనంతపురం జిల్లా (Anantapuram Dist.) ప్రజల బాధలు అర్థం చేసుకోవాలని, వర్షాలు లేక అనంత రైతు (Farmer) జీవితం ఎండిపోతోందని ఆవేదన వ్యక్తం చేశారు. ఎనిమిదేళ్లుగా రైతులు పంటలు (Crops) వేసుకోలేని దుస్థితి ఏర్పడిందన్నారు. అనంతపురం జిల్లా గురించి నాయకులు మాట్లాడాలని కోరారు. అప్పరభద్ర ప్రాజెక్టు (Apparabhadra project) కట్టిన తరువాత జిల్లా ఎడారిగా మారిపోతోందన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పరిస్థితి దారుణంగా ఉందని, యువతకు ఉద్యోగాలు, నీళ్లు లేవన్నారు. గుంతకల్లు రైల్వే జోన్ (Guntakallu Railway Zone), కడప ఉక్కు (Kadapa Steel Factory), ఏపీ రాజధాని (AP Capital) గురించి చెప్పాలని శైలజానాథ్ డిమాండ్ చేశారు.

Updated Date - Mar 31 , 2024 | 12:11 PM