Share News

TEACHERS : ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించాలి

ABN , Publish Date - Oct 29 , 2024 | 11:54 PM

ఉపాధ్యాయుల పెండింగ్‌ సమస్యలు పరిష్కరించాలని ఎస్టీయూ నాయకులు డీఈఓను కోరారు. ఆ సంఘం జిల్లా అధ్యక్షుడు రమణారెడ్డి, ప్రధాన కార్యదర్శి రామాంజినేయులు, ఇతర రాష్ట్ర, జిల్లా నాయకులు డీఈఓను మంగళవారం జిల్లా విద్యాశాఖాధికారి కా ర్యాలయంలో కలిశారు.

TEACHERS : ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించాలి
STU leaders talking to DEO

డీఈఓకు సంఘాల నేత వినతి

అనంతపురం విద్య, అక్టోబరు 29 (ఆంధ్రజ్యోతి) : ఉపాధ్యాయుల పెండింగ్‌ సమస్యలు పరిష్కరించాలని ఎస్టీయూ నాయకులు డీఈఓను కోరారు. ఆ సంఘం జిల్లా అధ్యక్షుడు రమణారెడ్డి, ప్రధాన కార్యదర్శి రామాంజినేయులు, ఇతర రాష్ట్ర, జిల్లా నాయకులు డీఈఓను మంగళవారం జిల్లా విద్యాశాఖాధికారి కా ర్యాలయంలో కలిశారు. ఈ సందర్భంగా వారు మా ట్లాడుతూ... జిల్లాలో చాలాకాలంగా డీఎస్సీల్లో ఎంపి కైన ఉపాధ్యాయుల సీనియారిటీ జాబితాలు పెం డింగ్‌లో ఉన్నాయన్నారు. వాటి తో పాటు మిగిలిన సమస్య లను పరిష్కరించాలని కోరారు. కార్యక్రమంలో ఎస్టీ యూ రాష్ట్ర ప్రధానకార్యదర్శి చంద్రశేఖర్‌, సీనియర్‌ నాయకుడు రామన్న, మున్సిపల్‌ ఉపాధ్యాయుల రా ష్ట్ర కన్వీనర్‌ ఫణి భూషణ్‌, కిశోర్‌, రాష్ట్ర కౌన్సిలర్లు శివయ్య ఆచారి, కృష్ణ మోహన, సురేష్‌ బాబు, జిల్లా అధనపు ప్రధాన కార్యదర్శి రాజశేఖర్‌, జిల్లా నాయకులు మురళి, నాగభూషణ, శ్రీరాములు, తిమ్మరాజు, ఇతర నాయకులు పాల్గొన్నారు.


డీఈఓను కలిసిన ఆప్టా నాయకులు...

జిల్లా విద్యాశాఖాధికారి ప్రసాద్‌బాబును ఏపీ ప్రై మరీ టీచర్స్‌ అసోసియేషన నాయకులు కలిశారు. ఆ సంఘం జిల్లా అధ్యక్షుడు గోపాల్‌రెడ్డి, ప్రధానకార్యదర్శి వెంకటరత్నం, జిల్లా సహాధ్యక్షులు ప్రభాకర్‌రెడ్డి ఇతర నాయకులు డీఈఓను కలిశారు.

టీఎనయూఎస్‌ నాయకులు... నాయకులు డీఈఓను ఆయన చాంబర్‌లో మంగళవారం టీఎన యూఎస్‌ కలిశారు. యూ-డైస్‌ ప్లస్‌, అపార్‌ తదితర సమస్యలను డీఈఓను దృష్టికి తీసుకెళ్లారు. టీఎన యూఎస్‌ నాయకులు రామలింగప్ప, ప్రకాష్‌, జైపాల్‌ నాయుడు, గోపాల్‌, రవీంద్రనాథ్‌, మృత్యుంజయ, ప్రభాకర్‌, ఆంజనేయులు, శ్రీనివాసులు, ప్రసాద్‌ నాగభూషణ తదితరులు ఉన్నారు.

వైఎస్‌ఆర్‌టీఏ నాయకులు... డీఈఓను మంగళ వారం వైఎస్‌ఆర్‌ టీచర్స్‌ అసోసియేషన నాయకులు సైతం కలిశారు. జిల్లా అధ్యక్షులు నాగిరెడ్డి, ఇతర నేతలు డీఈఓను కలసి పుష్ఫగుచ్ఛం అందించి శుభా కాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో నాయకులు గోవింద్‌రెడ్డి, రమణప్ప, గోపాల్‌, రామకృష్ణ, సిద్ద ప్రసాద్‌, సుబహాన, క్రిష్ణ నాయక్‌, వెంకటరెడ్డి, చిన్నారెడ్డి తదితరులు పాల్గొన్నారు.


మరిన్ని అనంతపురం వార్తల కోసం....

Updated Date - Oct 29 , 2024 | 11:54 PM