Share News

రాంపురంలో రాళ్లదాడి

ABN , Publish Date - May 08 , 2024 | 12:23 AM

రాప్తాడు నియోజకవర్గంలో వైసీపీ శ్రేణులు రౌడీయిజానికి దిగాయి. కనగానపల్లి మండలం రాంపురం గ్రామంలో టీడీపీ కూటమి అభ్యర్థి, మాజీ మంత్రి పరిటాల సునీత మంగళవారం ఎన్నికల ప్రచారం నిర్వహించారు. గ్రామంలో ఆమెకు టీడీపీ నాయకులు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. ఆమె రోడ్‌ షోకు భారీగా జనం తరలిరావడంతో జీర్ణించుకోలేని వైసీపీ వర్గీయులు మిద్దెలపైకి ఎక్కి రాళ్లు రువ్వారు. దీంతో గ్రామంలో ఉద్రిక్తత ఏర్పడింది. వైసీపీకి చెందిన కొందరు యువకులు మిద్దెలపైకి ఎక్కి మీసాలు దువ్వుతూ.. తొడలు ..

రాంపురంలో రాళ్లదాడి
YSP cadres throwing stones at Paritala Sunitha's campaign

రెచ్చిపోయిన వైసీపీ మూకలు

అడ్డొచ్చిన పోలీసులపైనా దాడికి యత్నం

పరిటాల సునీత ప్రచారాన్ని అడ్డుకునే కుట్ర

ధర్మవరం రూరల్‌, మే 7: రాప్తాడు నియోజకవర్గంలో వైసీపీ శ్రేణులు రౌడీయిజానికి దిగాయి. కనగానపల్లి మండలం రాంపురం గ్రామంలో టీడీపీ కూటమి అభ్యర్థి, మాజీ మంత్రి పరిటాల సునీత మంగళవారం ఎన్నికల ప్రచారం నిర్వహించారు. గ్రామంలో ఆమెకు టీడీపీ నాయకులు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. ఆమె రోడ్‌ షోకు భారీగా జనం తరలిరావడంతో జీర్ణించుకోలేని వైసీపీ వర్గీయులు మిద్దెలపైకి ఎక్కి రాళ్లు రువ్వారు. దీంతో గ్రామంలో ఉద్రిక్తత ఏర్పడింది. వైసీపీకి చెందిన కొందరు యువకులు మిద్దెలపైకి ఎక్కి మీసాలు దువ్వుతూ.. తొడలు కొడుతూ దమ్ముంటే రావాలని సవాలు విసిరారు. అక్కడే ఉన్న ఎస్‌ఐ


మల్లికార్జునరెడ్డి తన సిబ్బందితో మిద్దెలపైకి వెళ్లి రాళ్లు రువ్వుతున్నవారిని అడ్డుకున్నారు. ఆ సమయంలో ఎస్‌ఐ, కానిస్టేబుళ్లపై కూడా వారు దాడికి యత్నించారు. టీడీపీవారితోపాటు పోలీసులను సైతం దూషించారు. దీంతో ఎస్‌ఐ మల్లికార్జునరెడ్డి లాఠీకి పనిచెప్పారు. గ్రామానికి స్పెషల్‌ పార్టీ పోలీసులు చేరుకోవడంతో పరిస్థితి అదుపులోకి వచ్చింది. విషయం తెలుసుకున్న ధర్మవరం డీఎస్పీ శ్రీనివాసులు గ్రామానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. వైసీపీ వర్గీయులు రాళ్లు విసురుతున్న సమయంలో పరిటాల సునీత కలుగజేసుకుని టీడీపీ నాయకులు, కార్యకర్తలకు సంమయనం పాటించాలని సూచించారు. ఓటమి భయంతో ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాశరెడ్డి ఇలాంటి చర్యలకు ఉసిగొల్పుతున్నారని ఆమె విమర్శించారు. రాళ్లదాడికి పాల్పడిన ముగ్గురు వైసీపీ వర్గీయులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

మరిన్ని అనంతపురం వార్తల కోసం....

Updated Date - May 08 , 2024 | 12:24 AM