Share News

AP News: పుట్టపర్తిలో ఎస్సీ కమిషన్ చైర్మన్‌కు చేదు అనుభవం

ABN , Publish Date - Jan 15 , 2024 | 01:14 PM

Andhrapradesh: పుట్టపర్తిలో ఎస్సీ కమిషన్ చైర్మన్ విక్టర్‌కు చేదు అనుభవం ఎదురైంది. రాష్ట్ర ప్రభుత్వ తప్పిదాలను ఎత్తిచూపుతూ రాష్ట్ర ఎస్సీ కమిషన్ చైర్మన్ విక్టర్ ప్రసాద్‌ను ఎస్సీ సంఘం నేతలు నిలదీశారు. వైసీపీ ప్రభుత్వం వచ్చాక నా ఎస్సీ నా ఎస్టీ అని చెబుతూనే తమకున్న పథకాలను రద్దు చేశారంటూ మండిపడ్డారు.

AP News: పుట్టపర్తిలో ఎస్సీ కమిషన్ చైర్మన్‌కు చేదు అనుభవం

శ్రీ సత్యసాయి జిల్లా, జనవరి 15: పుట్టపర్తిలో ఎస్సీ కమిషన్ చైర్మన్ విక్టర్‌ ప్రసాద్‌కు చేదు అనుభవం ఎదురైంది. రాష్ట్ర ప్రభుత్వ తప్పిదాలను ఎత్తిచూపుతూ రాష్ట్ర ఎస్సీ కమిషన్ చైర్మన్ విక్టర్‌ను ఎస్సీ సంఘం నేతలు నిలదీశారు. వైసీపీ ప్రభుత్వం వచ్చాక నా ఎస్సీ నా ఎస్టీ అని చెబుతూనే తమకున్న పథకాలను రద్దు చేశారంటూ మండిపడ్డారు. 2240 మంది ఎస్సీ, ఎస్టీలపై వైసీపీ అధికారంలోకి వచ్చాక దాడులు చేశారని, కొందరిని చంపేశారన్నారు. 27 ఎస్సీ, ఎస్టీ పథకాలను ఈ ప్రభుత్వం రద్దు చేసిందని... ముందు దీనికి సమాధానం చెప్పాలని నేతలు డిమాండ్ చేశారు.

రద్దు చేసిన పథకాలను పునరుద్ధరించిన తర్వాతే అమరావతిలో అంబేద్కర్ విగ్రహావిష్కరణ జరగాలన్నారు. ఎస్సీ సంఘం నేతలు నిలదీయడంతో అసహనం వ్యక్తం చేస్తూ ఎస్సీ కమిషన్ చైర్మన్ విక్టర్ ప్రసాద్ అర్ధాంతరంగా మీడియా సమావేశం నుంచి వెళ్ళిపోయారు. వచ్చే ఎన్నికల్లో ఎస్సీ, ఎస్టీలే ఈ ప్రభుత్వానికి తగిన గుణపాఠం చెబుతారని ఎస్సీ సంఘం నేతలు హెచ్చరించారు.

మరిన్ని ఏపీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి...

Updated Date - Jan 15 , 2024 | 01:14 PM