Share News

ROADS : ఆ గుంతలతో సంబంధం లేదా..?

ABN , Publish Date - Dec 22 , 2024 | 12:36 AM

మండలంలోని కక్కలపల్లి ప్రధానరోడ్డు ప్యాచ వర్కు లు ప్రారంభమయ్యాయి. గత రెండురోజులుగా ము మ్మరంగా సాగుతున్న పనులు తుది దశకు చేరుకు న్నాయి. అయితే ప్యాచ వర్కులను చూసి పడే ఆనం దాన్ని రోడ్డుపై కనిపిస్తున్న గుంతలు ఆవిరి చేస్తున్నా యి. కక్కలపల్లి ప్రధాన రోడ్డు ప్యాచ వర్కుల ఆల స్యంతో కంకర తేలి వాహనదారులు, ప్రజలు ఇబ్బందు లు పడుతున్నారని ఈ నెల 19న ‘ఏం రోడ్డప్పా ఇది’ అనే శీర్షికన ఆంధ్ర జ్యోతి కథనం ప్రచురిం చింది.

ROADS : ఆ గుంతలతో సంబంధం లేదా..?
The hole is next to the BT patch in Kakkapally cross

ప్యాచ వర్క్‌లు చేసిన ప్రాంతంలోనే గుంతలు

ఇబ్బంది పడుతున్న వాహనదారులు

అనంతపురం రూరల్‌, డిసెంబరు 21(ఆంధ్రజ్యోతి): మండలంలోని కక్కలపల్లి ప్రధానరోడ్డు ప్యాచ వర్కు లు ప్రారంభమయ్యాయి. గత రెండురోజులుగా ము మ్మరంగా సాగుతున్న పనులు తుది దశకు చేరుకు న్నాయి. అయితే ప్యాచ వర్కులను చూసి పడే ఆనం దాన్ని రోడ్డుపై కనిపిస్తున్న గుంతలు ఆవిరి చేస్తున్నా యి. కక్కలపల్లి ప్రధాన రోడ్డు ప్యాచ వర్కుల ఆల స్యంతో కంకర తేలి వాహనదారులు, ప్రజలు ఇబ్బందు లు పడుతున్నారని ఈ నెల 19న ‘ఏం రోడ్డప్పా ఇది’ అనే శీర్షికన ఆంధ్ర జ్యోతి కథనం ప్రచురిం చింది. ఇందుకు సంబంధి త అధికారులు స్పందిం చా రు. ఈ క్రమంలోనే రోడ్డు పనులు చురుగ్గా జరుగుతు న్నాయి. అయితే కేవలం ప్యాచ వర్కు లు చేస్తూ, రోడ్డు పైన, రోడ్డుకు అటు ఇటు ఉన్న గుంతలను ఏమా త్రం పట్టించుకోవడం లేదు. ఆ గుంతల్లో బీటీ మిశ్ర మం వేస్తే సమస్య పరిష్కారం అవుతుంది. అయినా ఇవేవీ పట్టించుకోకుండా ప్యాచ వర్కులు మాత్రమే చేసు కుంటూ వెళుతున్నారు. చిన్న చిన్న గుంతలను కూడా చూసీచూడనట్లు వదిలేస్తున్నారు. దీనిపై కొంత మంది వాహనదారులు పెదవిరుస్తు న్నారు. ఇంత పనులు చేస్తున్నారు.... రోడ్డు మధ్యన, ఇరుపక్కల ఉన్న పక్కనున్న గుంతలను కూడా కనిపించకుండా చేస్తే ప్రయాణ కష్టాలు తీరుతాయని ప్రజలు , వాహనాదారులు మాట్లాడుకుంటున్నారు.


మరిన్ని అనంతపురం వార్తల కోసం....

Updated Date - Dec 22 , 2024 | 12:36 AM