Share News

Sri Sathya Sai Dist.: ప్రధాని మోదీ పర్యటనలో మీడియాకు నో ఎంట్రీ

ABN , Publish Date - Jan 16 , 2024 | 12:36 PM

శ్రీ సత్యసాయి జిల్లా: ప్రధానమంత్రి నరేంద్రమోదీ మంగళవారం శ్రీ సత్యసాయి జిల్లాలో పర్యటన నేపథ్యంలో మీడియాను అనుమతించడంలేదు. గోరంట్ల మండలం, పాలసముద్రంలో నేషనల్ అకాడమీ ఆఫ్ కస్టమ్స్, ఇన్‌డైరెక్ట్ టాక్సెస్ అండ్ నార్కోటిక్స్(నాసిన్) సెంటర్‌ను మోదీ ప్రారంభించనున్నారు.

Sri Sathya Sai Dist.: ప్రధాని మోదీ పర్యటనలో మీడియాకు నో ఎంట్రీ

శ్రీ సత్యసాయి జిల్లా: ప్రధానమంత్రి నరేంద్రమోదీ మంగళవారం శ్రీ సత్యసాయి జిల్లాలో పర్యటన నేపథ్యంలో మీడియాను అనుమతించడంలేదు. గోరంట్ల మండలం, పాలసముద్రంలో నేషనల్ అకాడమీ ఆఫ్ కస్టమ్స్, ఇన్‌డైరెక్ట్ టాక్సెస్ అండ్ నార్కోటిక్స్(నాసిన్) సెంటర్‌ను మోదీ ప్రారంభించనున్నారు. ఈ కార్యక్రమానికి గవర్నర్ అబ్దుల్ నజీర్, సీఎం జగన్ హాజరు కానున్నారు. దేశంలోనే ప్రతిష్టాత్మక నాసిన్ ప్రారంబోత్సవాన్ని ఐఅండ్‌పీఆర్ డిపార్ట్‌మెంట్ పట్టించుకోలేదు. దీంతో అనుమతి లేదంటూ నాసిన్ మెయిన్ గేట్ వద్ద మీడియాను పోలీసులు అడ్డుకున్నారు.

ఏపీ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు హయాంలో నాసిన్ నిర్మాణం ప్రారంభమైంది. నాసిన్‌ను ప్రతిష్టత్మకంగా తీసుకుని చంద్రబాబు శంఖుస్థాపన చేశారు. నాసిన్ ప్రాధాన్యత గురించి అధికారులు మీడియాకు వివరాలు వెల్లడించారు. అయితే హడావుడి లేకుండా ప్రారంబోత్సవం గోప్యంగా ఉంచారు. కనీసం పౌర సంబంధాలశాఖ అధికారులు కూడా మీడియాకు నాసిన్ అకాడమీ వివరాలు వెల్లడించలేదు. కాగా భూములు త్యాగం చేసిన రైతులకు ఇప్పటివరకు రాష్ట్ర ప్రభుత్వం పరిహారం చెల్లించలేదు.

Updated Date - Jan 16 , 2024 | 12:39 PM