Share News

TEACHERS : ఉచ్చు బిగుస్తోంది గురూ..!

ABN , Publish Date - Apr 22 , 2024 | 12:09 AM

రాజకీయ విందులో పాల్గొన్న ఉపాధ్యాయులు, ఎస్‌ఎ్‌సఏ ఉద్యోగుల చుట్టూ ఉచ్చు బిగుస్తోంది. కీలక సాక్ష్యాలు లేకుండా చేసినా.. ‘టవర్‌ డంప్‌’ ద్వారా డిన్నర్‌ జరిగిన డాబా ప్రాంతంలో ఎవరెవరు ఉన్నారో కనిపెట్టేందుకు రంగం సిద్ధమైనట్లు తెలిసింది. ఎస్పీ ద్వారా విందు జరిగిన ప్రాంతంలో సెల్‌ఫోన సిగ్నల్స్‌, కాల్‌డేటాను సేకరించేందుకు ప్రయత్నిస్తున్నారని సమాచారం.

TEACHERS : ఉచ్చు బిగుస్తోంది గురూ..!
SSA Office, Ananthapur

రాజకీయ విందుపై దర్యాప్తు ముమ్మరం

ఎస్పీని టవర్‌ డంప్‌ కోరిన జడ్పీ సీఈఓ..?

అనంతపురం విద్య, ఏప్రిల్‌ 21: రాజకీయ విందులో పాల్గొన్న ఉపాధ్యాయులు, ఎస్‌ఎ్‌సఏ ఉద్యోగుల చుట్టూ ఉచ్చు బిగుస్తోంది. కీలక సాక్ష్యాలు లేకుండా చేసినా.. ‘టవర్‌ డంప్‌’ ద్వారా డిన్నర్‌ జరిగిన డాబా ప్రాంతంలో ఎవరెవరు ఉన్నారో కనిపెట్టేందుకు రంగం సిద్ధమైనట్లు తెలిసింది. ఎస్పీ ద్వారా విందు జరిగిన ప్రాంతంలో సెల్‌ఫోన సిగ్నల్స్‌, కాల్‌డేటాను సేకరించేందుకు ప్రయత్నిస్తున్నారని సమాచారం.

తొక్కి పెట్టాలని..

ఎన్నికలలో వైసీపీకి మద్దతు కోరేందుకు గత నెల 31జూ గురువులు రాజకీయ విందు చేసుకున్నారు. నేషనల్‌ హైవే సమీపంలోని ఓ డాబాలో ఏర్పాటు చేసిన డిన్నర్‌కు సుమారు 150 మంది హాజరయ్యారు.


ఈ విందులో వైసీపీ ఎమ్మెల్యే ఒకరు పాల్గొన్నారు. ఆయనకు మద్దతుగా వైపీసీ అనుబంధ ఉపాధ్యాయ సంఘం నాయకులు, వైసీపీ అనుకూల ఉపాధ్యాయ సంఘం నాయకులు, ఉపాధ్యాయులు వ్యవహారం నడిపించారు. దీనిపై ఆంధ్రజ్యోతిలో పలు కథనాలు రావడంతో కలకలం రేగింది. విందులో పాల్గొన్న గురువిందలు అప్రమత్తమై.. సాక్ష్యాలు లేకుండా సీసీ ఫుటేజీని తొలగించారని ప్రచారం జరిగింది. ఎన్నికల కోడ్‌ అమల్లో ఉన్న సమయంలో ఒక పార్టీకి మద్దతుగా నిర్వహించిన విందుకు ప్రభుత్వ ఉపాధ్యాయులు హాజరు కావడం విమర్శలకు తావిచ్చింది. కానీ విద్యాశాఖ, సమగ్రశిక్ష అధికారులు విచారణ మమ అనిపించారు.

అదే కీలకం..

విందు రాజకీయంపై జడ్పీ సీఈఓ విచారణకు దిగారు. విందు జరిగిన రోజు ఆ ప్రాంతంలో ఎవరెవరు ఉన్నారో సెల్‌ ఫోన సిగ్నల్స్‌ ఆధారంగా గుర్తించాలని నిర్ణయించారు. అందుకు వసరమైన ‘టవర్‌ డంప్‌’ రిపోర్ట్‌ ఇవ్వాలని ఎస్పీకి జడ్పీ సీఈఓ లేఖ రాసినట్లు తెలిసింది.


రాజకీయ విందులో కీలకంగా వ్యవహించిన ఐదుగురు ఉపాధ్యాయ సంఘాల నాయకులతోపాటు మరో 40 మంది వివరాలను ఇప్పటికే విచారణ అధికారులు సేకరించినట్లు విశ్వసనీయంగా తెలిసింది. వీరిని మరింతగా బిగించేందుకు ‘టవర్‌ డంప్‌’ కీలకం కానుంది. సీసీ ఫుటేజీ మాయమైనా.. టవర్‌ డంప్‌ ఆధారంగా అక్కడున్నవారి సెల్‌ఫోన సిగ్నల్స్‌, కాల్స్‌ వివరాలు బయట పడతాయి. దీని ఆధారంగా ఎన్నికల నిబంధనలను ఉల్లంఘించినందుకు చర్యలు తీసుకునే అవకాశం ఉంది.

మరిన్ని అనంతపురం వార్తల కోసం...

Updated Date - Apr 22 , 2024 | 12:51 AM