CHANEL : వృథాగా ఫీడర్ చానల్
ABN , Publish Date - Dec 06 , 2024 | 12:16 AM
స్థానిక శింగనమల చెరువు నిండిన తరువాత వృథాగా పోయే నీరు సలకంచెరువు చెరువుకు వెళ్లేందుకు గత 22 సంవత్సరాలు కిందట రూ.40 లక్షలు ఖర్చుతో 10 కిలో మీటర్ల ఫీడల్ చానల్ ఏర్పాటు చేశారు. అయితే దాని ద్వారా ఇప్పటి వరకు సలకం చెరువుకు చుక్క నీరు కూడా చేరిన సందర్భంలేదు.
రూ. 40 లక్షలతో నిర్మించినా ... నెరవేరని లక్ష్యం
అధికారులు, ప్రజాప్రతినిధుల నిర్లక్ష్యంతో కంపచెట్లతో నిండిన వైనం
శింగనమల, డిసెంబరు 5(ఆంధ్రజ్యోతి) : స్థానిక శింగనమల చెరువు నిండిన తరువాత వృథాగా పోయే నీరు సలకంచెరువు చెరువుకు వెళ్లేందుకు గత 22 సంవత్సరాలు కిందట రూ.40 లక్షలు ఖర్చుతో 10 కిలో మీటర్ల ఫీడల్ చానల్ ఏర్పాటు చేశారు. అయితే దాని ద్వారా ఇప్పటి వరకు సలకం చెరువుకు చుక్క నీరు కూడా చేరిన సందర్భంలేదు. ఫీడర్ చానల్ నిర్మించిన ప్పటి నుంచి శింగనమల చెరువు నిండకపోవడమే కా రణం. దీంతో కాలువ పొడువునా కంపచెట్లు, పిచ్చి మొక్కలు పెరిగి పూడిపోయింది. మూడేళ్ల కిందట శిం గనమల చెరువు నిండి ఐదు నెలాలు నీరు పారినా, వాటిని కాలువకు మళ్లించడంలో అధికారు లు, పాలకు లు విఫలమయ్యారు. ప్రస్తుత పాలకులైనా కాలువ మరమ్మతులు చేపట్టాలని రైతులు కోరుతున్నారు.
రూ. 40 లక్షలు వృఽథా
శింగనమల చెరువు నిండిన తరువాత వృథాగా పారే నీటిని సలకం చెరువుకు మళ్లించేందుకు 2002 సంవత్సరంలో అప్పటి కలెక్టర్ సోమేష్‌కుమార్ చర్యలు చేపట్టారు. వృథా నీటిని సలకంచెరువుకు చేర్చేందుకు గోవిందరాయనిపేట, ఈస్టు నరసాపురం, పెద్ద మట్ల గొంది, చిన్న మట్లగొంది గ్రామాల మీదుగా రూ. 40 లక్షల వ్యయంతో సలకం చెరువు చెరువుకు 10 కిలో మీటర్ల కాలువ ఏర్పాటు చేశారు. ఈ కాలువ ద్వారా నీరు చేరుతే దాదాపు 10 గ్రామాల్లో భూరగ్భజలాలు పెరుగుతాయని, అలాగే సలకం చెరువకు నీరు చేరుతే పంటలు సాగు చేయవచ్చని ఆయా గ్రామాల రైతు లు అంటున్నారు. అయితే 22 సంవత్సరాలకు గాను ప్రారంభంలో ఒక సారి మాత్రమే చెరువుకు నీరు కొద్ది గా చేరింది. ఇప్పటి వరకు లేదు. దీంతో కాలువ ఎక్కవ శాతం పూడిపోవడంతో పాటు కంపచెట్ల పెరగ డంతో, అక్కడ కాలువ ఉందా అనే సందేహం కలుగు తోంది.
20 నుంచి 40 టీఎంసీల నీరు ఏటిపాలు
గత మూడేళ్ల కిందట శింగనమల చెరువు నిండి పోయిన తరువాత వృఽథానీటిని ఫీడర్ చానల్‌కు మళ్లిం చాల్సి ఉంది. అయితే అప్పట్లో అధికారులు, పాలకులు ముందస్తు ప్రణాళికతో కాలువ మరమ్మతులు చేసి ఉంటే నీరు కాలువకు మళ్లించే అవకాశం ఉండేది. అయితే నిర్లక్ష్యం కారణంగా ఐదు నెలల పాటు శింగన మల చెరువు నుంచి దాదాపు 20 నుంచి 40 టీఎంసీ లు నీరు ఏటిపాలు చేశారని అప్పట్లో రైతులు, రైతు సంఘాల నాయకలు, మేధావులు విమర్శించారు.
అంచనాలు వేసి పంపాం - సాయినాథ్, జేఈ, ఇరిగేషన శాఖ
గోవిందరాయపేట నుంచి స లకంచెరువు చెరువు వర కు ఉన్న కాలువలో కంప చెట్లు తొలగించేందుకు, మ రమ్మతు లకు ప్రణాళికలు తయారు చే శాం. రూ.39 లక్షలు వరకు ఎన ఆర్‌జీఎస్ కింద పనులు చేపట్టేం దుకు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపాం.
మరిన్ని అనంతపురం వార్తల కోసం....