Share News

KALAVA SRINIVASULU : కిక్కిరిసిన దుర్గం

ABN , Publish Date - Apr 25 , 2024 | 12:01 AM

టీడీపీ కూటమి అభ్యర్థిగా రాయదుర్గంలో కాలవ శ్రీనివాసులు బుధవారం నామినేషన దాఖలు చేశారు. టీడీపీ, బీజేపీ, జనసేన నాయకులు, కార్యకర్తలు వేలాది మందితో రోడ్‌షో నిర్వహించారు. నియోజకవర్గంలోని వివిధ గ్రామాల నుంచి పెద్ద ఎత్తున పార్టీ శ్రేణులు తరలివచ్చారు. అంతకు మునుపు కాలవ శ్రీనివాసులు శాంతినగర్‌లోని బన్ని మహంకాళి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించుకున్నారు. ఉదయం 11.45 గంటలకు ప్రారంభమైన రోడ్‌షో మధ్యాహ్నం 2.45 వరకు...

KALAVA SRINIVASULU : కిక్కిరిసిన దుర్గం
Kalava Srinivas is filing nomination

వేలాది మందితో కాలవ రోడ్‌ షో

టీడీపీ కూటమి అభ్యర్థిగా నామినేషన

రాయదుర్గం, ఏప్రిల్‌ 24: టీడీపీ కూటమి అభ్యర్థిగా రాయదుర్గంలో కాలవ శ్రీనివాసులు బుధవారం నామినేషన దాఖలు చేశారు. టీడీపీ, బీజేపీ, జనసేన నాయకులు, కార్యకర్తలు వేలాది మందితో రోడ్‌షో నిర్వహించారు. నియోజకవర్గంలోని వివిధ గ్రామాల నుంచి పెద్ద ఎత్తున పార్టీ శ్రేణులు తరలివచ్చారు. అంతకు మునుపు కాలవ శ్రీనివాసులు శాంతినగర్‌లోని బన్ని మహంకాళి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించుకున్నారు. ఉదయం 11.45 గంటలకు ప్రారంభమైన రోడ్‌షో మధ్యాహ్నం 2.45 వరకు కొనసాగింది. శాంతినగర్‌, బళ్లారిరోడ్‌, వినాయకసర్కిల్‌, బస్టాండ్‌, లక్ష్మీబజార్‌ మీదుగా తహసీల్దారు కార్యాలయం వరకు సాగింది.


వినాయక సర్కిల్‌, లక్ష్మీబజార్‌లో ఆయనను గజమాలలతో సత్కరించారు. ముస్లీం మైనార్టీలు సంప్రదాయంగా టోపీ, శాలువతో సన్మానించారు. కార్యకర్తలకు అభివాదం చేస్తూ, విజయ సంకేతం చూపుతూ కాలవ ముందుకు కదిలారు. అనంతరం నామినేషన దాఖలు చేశారు. బీజేపీ, జనసేన నియోజకవర్గ ఇనచార్జిలు వసుంధర, మంజునాథ, కాలవ తనయుడు కాలవ భరత వాహనంపై కాలవతో కలిసి ప్రయాణించారు. కణేకల్లు, బొమ్మనహాళ్‌, గుమ్మఘట్ట, డి.హీరేహాళ్‌, రాయదుర్గం మండలాలల నుంచి వేలాది మంది వాహనాలలో తరలిరావడంతో రాయదుర్గం రోడ్లన్నీ కిక్కిరిసిపోయాయి. సీఐలు శ్రీనివాసులు, ప్రసాద్‌రావు బందోబస్తు ఏర్పాటు చేశారు.

రాయదుర్గం అభివృద్ధికి కష్టపడతా..

రాష్ట్రంలోనే అభివృద్ధి చెందిన నియోజకవర్గంగా రాయదుర్గాన్ని తీర్చిదిద్దే వరకూ కష్టపడుతునే ఉంటానని టీడీపీ అభ్యర్థి కాలవ శ్రీనివాసులు అన్నారు. రోడ్‌షోను చూస్తే ప్రజాభిమానం తనపై ఏ స్థాయిలో ఉందో అర్థమైపోయిందని అన్నారు. మండే ఎండను లెక్కచేయకుండా, ఉరికే ఉత్సాహంతో రోడ్డు పొడవునా కేరింతలు కొడుతూ తనను విజయీభవ అని దీవిస్తున్న కూటమి శ్రేణులకు కృతజ్ఞతలు అన్నారు. నామినేషన సందర్భంగా ప్రజలకు హామీలు ఇస్తున్నారని స్పష్టం చేశారు. నియోజకవర్గం అన్ని రంగాలలో అభివృద్ధి చెందేవరకు విశ్రమించకుండా శ్రమిస్తానని అన్నారు. భైరవానతిప్ప ప్రాజెక్టుకు కృష్ణా జలాలను తీసుకువస్తానని అన్నారు. ఐదేళ్లలో ఉంతకల్లు రిజ ర్వాయర్‌ పనులు ప్రారంభించి, పదేళ్లలో పూర్తి చేయిస్తానని అన్నారు.


తుంగభద్ర ఎగువ కాలువ ఆధునికీకరణ పనులను చేపడతామని అన్నారు. ఎడారీకరణను, వలసలను నివారించి, పూర్వవైభవం తీసుకొస్తామని అన్నారు. నియోజకవర్గంలో లక్ష ఎకరాలకు సాగునీరు అందించడానికి చంద్రబాబునాయుడు ఆశీస్సులతో కఠోరంగా శ్రమిస్తానని అన్నారు. వెనుకబడిన తరగతుల వారికి హాస్టల్‌ను ఏర్పాటు చేయిస్తామని, బాలికల జూనియర్‌ కళాశాలకు శాశ్వత భవనం నిర్మిస్తామని హామీ ఇచ్చారు. ఉర్దూ బాలికల కళాశాలను తీసుకొస్తామని అన్నారు. కణేకల్లుకు డిగ్రీ కళాశాల తీసుకొస్తామన్నారు. చెరువును బాగు చేయిస్తామన్నారు. గార్మెంట్స్‌ పరిశ్రమను బతికించడానికి చేపట్టిన టెక్స్‌టైల్స్‌ పార్క్‌లో 50 యూనిట్లు ఏర్పాటు చేయిస్తామని అన్నారు. నేమకల్లు, బొమ్మనహాళ్‌ మధ్యలో ఇనుపఖనిజం ప్రత్యేక సెజ్‌ ఏర్పాటు చేయిస్తామని అన్నారు. వేలాది మందికి ఉపాధి కల్పిస్తామన్నారు.

మరిన్ని అనంతపురం వార్తల కోసం....

Updated Date - Apr 25 , 2024 | 12:01 AM