Share News

Governor Abdul Nazir: గవర్నర్ అబ్దుల్ నజీర్ అనంతపురం పర్యటనలో అంగన్వాడీల నిరసన

ABN , Publish Date - Jan 06 , 2024 | 04:15 PM

ఏపీ గవర్నర్ అబ్దుల్ నజీర్ ( Governor Abdul Nazi ) శనివారం నాడు అనంతపురంలో పర్యటిస్తున్నారు. ఈ పర్యటనలో అంగన్వాడీల నిరసన వ్యక్తం చేశారు. గవర్నర్‌కి తమ సమస్యలు చెప్పుకుని ఆవేదన వ్యక్తం చేశారు. అంగన్వాడీల సమస్యలను పరిష్కరించడానికి మీరైనా చొరవ చూపండి అంటూ ప్రకార్లతో ఆందోళన తెలిపారు.

Governor Abdul Nazir: గవర్నర్ అబ్దుల్ నజీర్ అనంతపురం పర్యటనలో అంగన్వాడీల నిరసన

అనంతపురం: ఏపీ గవర్నర్ అబ్దుల్ నజీర్ ( Governor Abdul Nazi ) శనివారం నాడు అనంతపురంలో పర్యటిస్తున్నారు. ఈ పర్యటనలో అంగన్వాడీల నిరసన వ్యక్తం చేశారు. గవర్నర్‌కి తమ సమస్యలు చెప్పుకుని ఆవేదన వ్యక్తం చేశారు. అంగన్వాడీల సమస్యలను పరిష్కరించడానికి మీరైనా చొరవ చూపండి అంటూ ప్రకార్లతో ఆందోళన తెలిపారు. నగరంలోని కలెక్టరేట్ నుంచి బుక్కరాయసముద్రానికి వెళ్తున్న గవర్నర్ అబ్దుల్ నజీర్ కాన్వాయ్ వద్దకు అంగన్వాడీలు వెళ్లే ప్రయత్నం చేశారు. బారీకేడ్లు ఏర్పాటు చేసి అంగన్వాడీలను పోలీసులు ను అడ్డుకున్నారు. ఫ్లకార్డులు పట్టుకుని నిరసన తెలుపుతున్న అంగన్వాడీలు వైపు చూస్తూ గవర్నర్ వెళ్లారు.

కాగా.. అంగన్వాడీల సమ్మెపై (Anganwadi Strike) ఏపీ ప్రభుత్వం (AP Government) ఎస్మా ప్రయోగిస్తూ జీవో జారీ చేసింది. ప్రభుత్వం ఎస్మా ప్రయోగించడాన్ని అంగన్వాడీలు తీవ్రంగా ఖండించారు. అంగన్వాడీలపై ఎస్మా ప్రయోగించడంపై యూనియన్ నేతలు ప్రభుత్వ తీరును తీవ్రంగా వ్యతిరేకించారు. యూనియన్ నేతలు ఏమన్నారంటే.. ‘‘ఆరు నెలల పాటు నిరసనలు, ధర్నాలు చేయవద్దని చెప్పడానికి మీరు ఆరు నెలలు ప్రభుత్వంలో ఉండాలి కదా. మాకు ఆరునెలల సమయం.. మహా అయితే నెల రోజుల పాటు మీరు అధికారంలో ఉంటారు. మీ ఎస్మాలకు భయపడేది లేదు.. మా సమ్మె ఆగదు... అవసరమైతే లీగల్‌గానే ఎదుర్కొంటాం. ప్రభుత్వం చర్చలకి పిలవాలి.. మా వేతనాల సమస్యలను పరిష్కరించాలని లేకుంటే సమ్మెను మరింత‌ ఉధృతం చేస్తాం. రేపు రాష్ట్ర వ్యాప్తంగా జీవో కాపీలను దగ్ధం చేసి నిరసన తెలుపుతాం’’ అని యూనియన్ నేతలు స్పష్టం చేశారు.

మరిన్ని ఏపీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి...

Updated Date - Jan 06 , 2024 | 04:19 PM