Share News

LIQUOR : లెక్క ఇస్తేనే చుక్క!

ABN , Publish Date - May 19 , 2024 | 11:16 PM

ప్రభుత్వ మద్యం దుకాణాల్లో మళ్లీ పాత పద్ధతిలో నగదు లావాదేవీలే జరుపుతున్నారు. పోలింగ్‌కు వారం రోజుల నుంచి ప్రభుత్వ మద్యం దుకాణాల్లో డిజిటల్‌ లావాదేవీలను (ఫోన పే, గుగూల్‌ పే) మాత్రమే అనుమతించారు. ఆయా రోజుల్లో ఎక్కడా నగదు తీసుకోలేదు. ఈనెల 13న ఎన్నికల పోలింగ్‌ జరిగింది. అనంతరం ప్రభుత్వ మద్యం దుకాణాల్లో డిజిటల్‌ లావాదేవీలను బంద్‌ చేశారు. జిల్లాలో 127 ప్రభుత్వ మద్యం దుకాణాలు నడుస్తున్నాయి. వీటిలో 90 శాతం దుకాణాల్లో ప్రస్తుతం నగదు లావాదేవీలు

LIQUOR : లెక్క ఇస్తేనే చుక్క!
Government Liquor Store in Anantapur

మళ్లీ డిజిటల్‌ లావాదేవీలు బంద్‌!

పోలింగ్‌కు ముందు కేవలం డిజిటల్‌

లావాదేవీల నిర్వహణ

పలు దుకాణాల్లో చిల్లర సమస్యతో సతమతం

కావాల్సిన మద్యం బ్రాండ్లు కరువు

అనంతపురం అర్బన, మే 19: ప్రభుత్వ మద్యం దుకాణాల్లో మళ్లీ పాత పద్ధతిలో నగదు లావాదేవీలే జరుపుతున్నారు. పోలింగ్‌కు వారం రోజుల నుంచి ప్రభుత్వ మద్యం దుకాణాల్లో డిజిటల్‌ లావాదేవీలను (ఫోన పే, గుగూల్‌ పే) మాత్రమే అనుమతించారు. ఆయా రోజుల్లో ఎక్కడా నగదు తీసుకోలేదు. ఈనెల 13న ఎన్నికల పోలింగ్‌ జరిగింది. అనంతరం ప్రభుత్వ మద్యం దుకాణాల్లో డిజిటల్‌ లావాదేవీలను బంద్‌ చేశారు. జిల్లాలో 127 ప్రభుత్వ మద్యం దుకాణాలు నడుస్తున్నాయి. వీటిలో 90 శాతం దుకాణాల్లో ప్రస్తుతం నగదు లావాదేవీలు మాత్రమే జరుపుతున్నారు. ఆయా దుకాణాల్లో ఎక్కడా ఫోన పే, గుగూల్‌ పే ద్వారా డబ్బులు స్వీకరించడం లేదు. దీంతో ఇదెక్కడి అన్యాయమంటూ మద్యంప్రియులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. డిజిటల్‌ లావాదేవీలు, నగదు రెండు ఆప్షన్లు ఇవ్వకుండా ప్రభుత్వం ఇష్టారాజ్యంగా వ్యవహరించడంపై మందు బాబులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.


జే బ్రాండ్స్‌ అంటగడుతున్న వైనం

ప్రస్తుతం ఎన్నికల పోలింగ్‌ ముగిసింది. జూన 4న ఎన్నికల ఫలితాలు రానున్నాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వ మద్యం దుకాణాలకు కేవలం జే బ్రాండ్స్‌ను మాత్రమే సరఫరా చేస్తున్నట్లు తెలిసింది. ఎన్నికల్లో లెక్కలు తారుమారైతే జే బ్రాండ్స్‌ నిల్వలు అలాగే ఉండిపోతాయన్న భయంతో ఇప్పటి దాకా నిల్వ చేసిన సరుకును ప్రభుత్వ దుకాణాలకు పంపుతున్నట్లు సమాచారం. జిల్లా వ్యాప్తంగా మద్యం దుకాణాల్లో కేవలం జే బ్రాండ్స్‌ మాత్రమే దర్శనమిస్తున్నాయి. మందు బాబులకు ఇష్టమైన బ్రాండ్లను ఎక్కడా ఉంచలేదు. దీంతో మందుబాబులు తీవ్ర నిరాశ చెందుతున్నారు. తప్పని పరిస్థితుల్లో కొందరు జే బ్రాండ్స్‌ను తీసుకోగా..


మరికొందరు ఇదేం ఖర్మ అంటూ నిరాశతో వెనుతిరుగు తున్నారు. మరోవైపు పలు ప్రభుత్వ మద్యం దుకాణాల్లో చిల్లర సమస్య ఏర్పడింది. అనంతపురం నగరంలోని సప్తగిరి సర్కిల్‌, నందిని హోటల్‌ వద్ద ఉన్న దుకాణాలతోపాటు పలు దుకాణాల్లో మద్యం బాటిల్‌కు కావాల్సిన డబ్బులు చిల్లరతో ఇస్తేనే మద్యం విక్రయిస్తున్నారు. లేదంటే నిర్దాక్షిణ్యంగా తమ వద్ద చిల్లర లేదంటూ చేతులెత్తేస్తున్నారు. ఫోన పే ద్వారా డబ్బులు వేస్తామన్నా ఆ సదుపాయం తమ వద్ద లేదంటూ చెబుతుండటం గమనార్హం. జిల్లా వ్యాప్తంగా ప్రస్తుతం ఇదే పరిస్థితి నెలకొంది. దీంతో మందుబాబులు పడరానిపాట్లు పడుతున్నారు.


మరిన్ని అనంతపురం వార్తల కోసం....

Updated Date - May 19 , 2024 | 11:16 PM