Share News

Anantapur: చంద్రబాబుతోనే నదుల అనుసంధానం..

ABN , Publish Date - Dec 31 , 2024 | 01:04 PM

రాష్ట్రంలో ప్రధాన నదులను అనుసంధానించడం చంద్రబాబుకే సాధ్యమని ప్రభుత్వ విప్‌ కాలవ శ్రీనివాసులు(Government Whip Kalava Srinivasulu) సోమవారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. ప్రతి ఏడాది సముద్రంలో కలిసిపోయే గోదావరి జలాలను సద్వినియోగం చేసుకొని రాయలసీమను సస్యశ్యామలం చేయాలని చంద్రబాబు తపిస్తున్నారని పేర్కొన్నారు.

Anantapur: చంద్రబాబుతోనే నదుల అనుసంధానం..

- ప్రభుత్వ విప్‌ కాలవ శ్రీనివాసులు

అనంతపురం: రాష్ట్రంలో ప్రధాన నదులను అనుసంధానించడం చంద్రబాబుకే సాధ్యమని ప్రభుత్వ విప్‌ కాలవ శ్రీనివాసులు(Government Whip Kalava Srinivasulu) సోమవారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. ప్రతి ఏడాది సముద్రంలో కలిసిపోయే గోదావరి జలాలను సద్వినియోగం చేసుకొని రాయలసీమను సస్యశ్యామలం చేయాలని చంద్రబాబు తపిస్తున్నారని పేర్కొన్నారు. ఫలితంగానే గోదావరి-కృష్ణా-పెన్నా(Godavari-Krishna-Penna) నదుల అనుసంధానం జరగబోతోందన్నారు.

ఈ వార్తను కూడా చదవండి: అతిక్రమిస్తే చర్యలు తప్పవు మరి..


ఎప్పటి నుంచో ప్రతిపాదనల్లోనే ఉండిపోయిన నదుల అనుసంధాన ప్రక్రియ సీఎం చంద్రబాబు చొరవతో కార్యరూపం దాల్చబోతుండటం హర్షణీయమని పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం వద్ద తన ప్రత్యేక పలుకుబడిని విశాల ప్రజాప్రయోజనాలకు ఉపయోగిస్తున్న తీరు రాష్ట్ర భవిష్యత్తుపై చంద్రబాబుకున్న బాధ్యతకు అద్దం పడుతోందని పేర్కొన్నారు. సీమ జిల్లాల్లో ప్రతి ఎకరానికి సాగునీరు అందించాలనే సీఎం ఆలోచనకు నిదర్శనమే ఈ నదుల అనుసంధానమన్నారు.


వరద సమయంలో గోదావరి నుంచి రోజుకు రెండు మూడు టీఎంసీల నీటిని మళ్లించడం వల్ల రాష్ర్టానికి ఎంతో మేలు జరుగుతుందన్నారు. సుమారు రూ.80 వేల కోట్ల వ్యయంతో చేపట్టబోయే ప్రాజెక్టును రాబోయే మూడు నెలల్లో ప్రారంభానికి ప్రయత్నిస్తుండటం ప్రశంసనీయమన్నారు. గోదావరి జలాలతో కృష్ణా డెల్టా, నాగార్జున సాగర్‌ ఆయకట్టు భూములకు సాగునీరందించడం సాధ్యపడుతుందన్నారు.

PANDU3.2.jpg


PANDU3.2.jpg

పోలవరం ద్వారా కృష్ణా నదికి గోదావరి జలాలు మళ్లించడంతో పాటు అక్కడి నుంచి బనకచెర్ల హెడ్‌ రెగ్యులేటర్‌కు నీరు మళ్లిస్తారని చంద్రబాబు(Chandrababu) చెప్పారన్నారు. తద్వారా 345 టీఎంసీల నీరు ఉపయోగించుకునే అవకాశం లభిస్తుందన్నారు. శ్రీశైలం ప్రాజెక్టు(Srisailam Project) ద్వారా కృష్ణా జలాలను సీమ జిల్లాలకు ఎక్కువ శాతం ఉపయోగించే వీలు కల్పించే ఈ బృహత్తర పథకంతో సీమ భవిష్యత్తు పూర్తిగా మారిపోతుందన్నారు. హంద్రీనీవా, గాలేరు-నగరి భవిష్యత్తు ఉజ్వలంగా ఉంటుందని కాలవ అన్నారు.


ఈవార్తను కూడా చదవండి: రాష్ట్రంలో మళ్లీ పెరుగుతున్న చలి

ఈవార్తను కూడా చదవండి: మంత్రిగా కొనసాగే నైతిక హక్కు షాకు లేదు

ఈవార్తను కూడా చదవండి: విద్యార్థుల శ్రేయస్సు దృష్ట్యా సమ్మె విరమించండి

ఈవార్తను కూడా చదవండి: తెలంగాణలో నక్సల్స్‌ కదలికలు?

Updated Date - Dec 31 , 2024 | 01:05 PM