Share News

Home Minister: అతిక్రమిస్తే చర్యలు తప్పవు మరి..

ABN , Publish Date - Dec 31 , 2024 | 12:30 PM

నూతన సంవత్సర వేడుకల్లో అతిగా ప్రవర్తిస్తే కఠినచర్యలు తప్పవని హోం మంత్రి పరమేశ్వర్‌(Home Minister Parameshwar) హెచ్చరించారు. బెంగళూరులో సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. నగర వ్యాప్తంగా ఎటువంటి హింసాత్మక సంఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు పకడ్బందీ చర్యలు తీసుకోనున్నారన్నారు.

Home Minister: అతిక్రమిస్తే చర్యలు తప్పవు మరి..

- నూతన సంవత్సర వేడుకల్లో జాగ్రత్తలు తప్పనిసరి

- రాత్రి ఒంటిగంట వరకే అనుమతులు

- బందోబస్తుకు 11 వేలమంది పోలీసులు

- హోం మంత్రి పరమేశ్వర్‌

బెంగళూరు: నూతన సంవత్సర వేడుకల్లో అతిగా ప్రవర్తిస్తే కఠినచర్యలు తప్పవని హోం మంత్రి పరమేశ్వర్‌(Home Minister Parameshwar) హెచ్చరించారు. బెంగళూరులో సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. నగర వ్యాప్తంగా ఎటువంటి హింసాత్మక సంఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు పకడ్బందీ చర్యలు తీసుకోనున్నారన్నారు. 11,830 మంది సిబ్బందిని బందోబస్తుకు కేటాయించామన్నారు. వీరిలో సీనియర్‌ అధికారులతోపాటు సివిల్‌ డిఫెన్స్‌, పోలీసు సిబ్బంది ఉన్నారన్నారు.

ఈ వార్తను కూడా చదవండి: Hero Darshan: హీరో దర్శన్‌ గ్యాంగ్‌కు సర్కార్‌ షాక్‌.. విషయం ఏంటంటే..


కేవలం నగరంలోనే కాకుండా రాష్ట్రమంతటా ఎక్కడా హింసకు దారి తీయకూడదని జిల్లా ఎస్పీలకు సూచించామన్నారు. కాగా నగరంలో డీసీఎం డీకే శివకుమార్‌(DCM DK Shivakumar) మీడియాతో మాట్లాడుతూ కొత్త సంవత్సరాన్ని స్వాగతించడం ఓ వేడుకగా ఉండాలని, వేధింపులకు, హింసకు కారణం కారాదన్నారు. శాంతిభద్రతలు కాపాడడంలో రాజీ ఉండదన్నారు. నగర పరిధిలో వెయ్యికిపైగా కెమెరాలను అమరుస్తున్నామన్నారు. ప్రజలు అతిగా ప్రవర్తించరాదన్నారు. అర్ధరాత్రి 1 గంట వరకు మాత్రమే అనుమతులు ఉంటాయని ఆ తర్వాత వేడుకలు, ఊరేగింపులు జరపరాదన్నారు.


city8.jpg

అతిగా ప్రవర్తిస్తే చర్యలు తీసుకుంటామన్నారు. కాగా ఎంజీ రోడ్డు, బ్రిగేడ్‌ రోడ్డు, చర్చ్‌స్ట్రీట్‌, ఇందిరానగర్‌, కోరమంగల ప్రాంతాలలో నూతన సంవత్సర వేడుకలకు భారీగా ఏర్పాట్లు చేస్తున్నారు. హోటళ్లు, రెస్టారెంట్‌లు, పబ్‌లు విద్యుద్దీపాలతో అలంకరించారు. మరోవైపు స్టార్‌ హోటళ్లలో ప్యాకేజ్‌ల పద్ధతిన వేడుకలకు ఆహ్వానించారు. సాధారణ నుంచి ఫైవ్‌స్టార్‌, 7స్టార్‌ హోటళ్లలో భారీగా ప్యాకేజీలు ప్రకటించారు. ఎంజీ రోడ్డు, బ్రిగేడ్‌ రోడ్లలో వారం రోజులుగా కొత్త ఉత్సాహం సాగుతోంది.


నంది హిల్స్‌ ప్రవేశంపై ఆంక్షలు

చిక్కబళ్ళాపురానికి అనుబంధంగా ఉండే నంది హిల్స్‌లో మంగళవారం సాయంత్రం 6 గంటలనుంచి జనవరి 1న బుధవారం ఉదయం 7 గంటల వరకు ప్రవేశం నిషేధిస్తున్నట్లు ప్రకటించారు. రాత్రివేళ నందిహిల్స్‌ ప్రాంతానికి ఎవరూ రాకూడదని సూచించారు. నందికొండలపై గెస్ట్‌హౌస్‌ బుకింగ్‌ రద్దు చేసినట్లు జిల్లా అధికారి రవీంద్ర తెలిపారు. నందికొండల చుట్టూ 150మంది పోలీసులను బందోబస్తుకు కేటాయించారు. అదే తరహాలోనే మం డ్య, మైసూరుతోపాటు వివిధ పర్యాటక కేంద్రాలలో ఆంక్షలు ఉంటాయన్నారు.


ఈవార్తను కూడా చదవండి: రాష్ట్రంలో మళ్లీ పెరుగుతున్న చలి

ఈవార్తను కూడా చదవండి: మంత్రిగా కొనసాగే నైతిక హక్కు షాకు లేదు

ఈవార్తను కూడా చదవండి: విద్యార్థుల శ్రేయస్సు దృష్ట్యా సమ్మె విరమించండి

ఈవార్తను కూడా చదవండి: తెలంగాణలో నక్సల్స్‌ కదలికలు?

Read Latest Telangana News and National News

Updated Date - Dec 31 , 2024 | 12:30 PM