Hero Darshan: హీరో దర్శన్ గ్యాంగ్‌కు సర్కార్ షాక్.. విషయం ఏంటంటే..
ABN , Publish Date - Dec 31 , 2024 | 12:12 PM
చిత్రదుర్గ రేణుకాస్వామి(Chitradurga Renuka Swamy) హత్యకేసులో నటుడు దర్శన్(Actor Darshan)తోపాటు ఇతర నిందితులకు సర్కార్ షాక్ ఇచ్చింది. ఏ2 నిందితుడిగా ఉన్న నటుడు దర్శన్ మెడికల్ గ్రౌండ్స్‌లో తొలుత బెయిల్ పొందారు.

- సుప్రీంకోర్టులో పిటిషన్‌కు అనుమతి
బెంగళూరు: చిత్రదుర్గ రేణుకాస్వామి(Chitradurga Renuka Swamy) హత్యకేసులో నటుడు దర్శన్(Actor Darshan)తోపాటు ఇతర నిందితులకు సర్కార్ షాక్ ఇచ్చింది. ఏ2 నిందితుడిగా ఉన్న నటుడు దర్శన్ మెడికల్ గ్రౌండ్స్‌లో తొలుత బెయిల్ పొందారు. ఆ తర్వాత రెగ్యులర్ బెయిల్ దక్కడంతో ప్రశాంతంగా బయటపడినట్లయ్యింది. నెలన్నరకాలంగా ఆసుపత్రిలో గడిపిన దర్శన్ రెగ్యులర్ బెయిల్ రావడంతో డిశ్చార్జ్ అయ్యారు.
ఈ వార్తను కూడా చదవండి: Robbery: ఉద్యోగులను కట్టేసి.. తుపాకీతో బెదిరించి రూ. 1.91 కోట్లు దోపిడీ..
కోర్టు అనుమతులు పొంది మైసూరులోని ఫాం హౌస్‌లో గడుపుతున్నారు. హైకోర్టు మంజూరు చేసిన బెయిల్‌ను వ్యతిరేకిస్తూ సుప్రీంకోర్టు(Supreme Court)లో పిటిషన్ దాఖలుకు రాష్ట్ర ప్రభుత్వం పోలీసుశాఖ(Police Department)కు అనుమతి ఇచ్చింది. ఈమేరకు పోలీసుశాఖ న్యాయవాదులు అనిల్ సినిశాని, సిద్దార్థ లూథ్రాను నియమించింది. మరో రెండు రోజుల్లో పిటిషన్ దాఖలు చేయనున్నారు. దీంతో దర్శన్‌తోపాటు నిందితులందరికీ షాక్ ఇచ్చినట్లు అయింది.
ఈవార్తను కూడా చదవండి: రాష్ట్రంలో మళ్లీ పెరుగుతున్న చలి
ఈవార్తను కూడా చదవండి: మంత్రిగా కొనసాగే నైతిక హక్కు షాకు లేదు
ఈవార్తను కూడా చదవండి: విద్యార్థుల శ్రేయస్సు దృష్ట్యా సమ్మె విరమించండి
ఈవార్తను కూడా చదవండి: తెలంగాణలో నక్సల్స్ కదలికలు?
Read Latest Telangana News and National News