Share News

Kuppam: వేట కత్తితో బెదిరించి.. ఐస్ క్రీమ్‌లు చోరీ

ABN , Publish Date - May 24 , 2024 | 06:33 PM

వేట కత్తి చూపి షాపు యజమానిని బెదిరించి ఓ గ్యాంగ్ ఐస్ క్రీమ్‌లు దొంగిలించింది. ఈ ఘటన ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని కుప్పం పట్టణంలో చోటు చేసుకుంది.

Kuppam: వేట కత్తితో బెదిరించి.. ఐస్ క్రీమ్‌లు చోరీ

కుప్పం, మే 24: వేట కత్తి చూపి షాపు యజమానిని బెదిరించి ఓ గ్యాంగ్ ఐస్ క్రీమ్‌లు దొంగిలించింది. ఈ ఘటన ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని కుప్పం పట్టణంలో చోటు చేసుకుంది. స్థానిక హెచ్‌పీ రోడ్డులో మణికంఠ ఐస్‌క్రీమ్ షాపు నిర్వహిస్తున్నాడు. బుధవారం రాత్రి గంగమాంబ అమ్మవారి విశ్వరూప దర్శనానికి జనం భారీగా తరలి వచ్చారు. ఆ క్రమంలో ఐస్ క్రీమ్ షాపు వద్దకు కొంత మంది యువకులు గుంపుగా వచ్చారు.

LokSabha Elections: అమిత్ షాకు లైన్ క్లియర్ చేస్తున్న మోదీ


తమకు ఐస్ క్రీమ్‌లు కావాలని అడగడంతో.. వారందరికీ మణికంఠ ఐస్ క్రీమ్ ఇచ్చాడు. అనంతరం ఐస్ క్రీమ్‌లకు నగదు చెల్లించాలని వారిని మణికంఠ కోరాడు. దీంతో ఆగ్రహించిన ఆ గ్యాంగ్ తమ వద్దనున్న పదునైన వేట కత్తి బయటకు తీశారు. తమనే డబ్బులు అడుగుతావా? ఎక్కవ చేశావంటే.. ఇక్కడే నరికేస్తామంటూ షాపు యజమానిని బెదిరించారు.

Rajinikanth: రజనీకాంత్‌కు యూఏఈ గోల్డెన్ వీసా


అక్కడే ఉన్న సుమారు రూ. 4 వేలు విలువ చేసే ఐస్ క్రీమ్ ప్యాకెట్ తీసుకుని అక్కడి నుంచి ఆ గ్యాంగ్ ఉడాయించింది. దీంతో మణికంఠ పోలీసులను ఆశ్రయించి.. ఫిర్యాదు చేశాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. అందులో భాగంగా షాప్ వద్దనున్న సీసీ కెమెరా ఫుటేజ్‌లను పోలీసులు పరిశీలిస్తున్నారు.

Read Latest News and National News here

Updated Date - May 24 , 2024 | 06:33 PM