Share News

తుమ్మల సమర్పించిన పురాణపండ ‘పచ్చకర్పూరం’.. నేటికీ పరిమళిస్తూనే ఉందంటోన్న తిరుమల పండిత బృందం

ABN , Publish Date - May 24 , 2024 | 12:07 AM

ఇటీవల శ్రీ వేంకటేశ్వర విశ్వ విద్యాలయంలో జరిగిన ఒక సెమినార్‌కు విచ్చేసిన కొందరు, ఆచార్యులు, పరిశోధక విద్యార్థులు ఎనిమిదేళ్లనాడు తుమ్మల నాగేశ్వర రావు ప్రచురించిన పురాణపండ శ్రీనివాస్ ‘పచ్చకర్పూరం’ గ్రంధంలో కొన్ని అంశాల్ని సభాముఖంగా ప్రస్తావించి.. ప్రశంసించడంతో... మరొకసారి ఈ పరమోత్తమమైన గ్రంధం హాట్ టాపిక్ అయ్యింది. ఈ విశేషాన్ని అప్పటికప్పుడు ప్రముఖ రచయిత పురాణపండకు ఫోన్‌లో ఒక ప్రొఫెసర్ తెలియపరిచగా... ‘తిరుమల రంగనాయకమంటపంలో వేదపండితుల మంత్ర ధ్వనుల మధ్య కప్పే శేష వస్త్రం’ ఎలాంటి అనిర్వచనీయ ఆనందానుభూతినిస్తుందో అదే అనుభూతి కలుగుతోందని పురాణపండ సంతోషం వ్యక్తం చేశారు.

తుమ్మల సమర్పించిన పురాణపండ ‘పచ్చకర్పూరం’.. నేటికీ పరిమళిస్తూనే ఉందంటోన్న తిరుమల పండిత బృందం

తిరుపతి, మే 23: సుదీర్ఘమైన కాలం గడిచినా... సత్యాన్వేషణలోంచి చూసినప్పుడు రసజ్ఞులు, పాఠకులు, భక్తులు, పరిశోధకులు కొన్ని విలువైన రచనల్ని, సంకలనాల్ని, అనువాదాల్ని పదే పదే పదిమంది మధ్య ప్రస్తావిస్తూ ఉంటారనడానికి ప్రత్యక్ష సాక్ష్యంగా ఎనిమిదేళ్లుగా ఈ శేషాచలంపై భక్త శ్రేణి, పండిత వర్గం ‘పచ్చకర్పూరం’ అనే అమోఘ అక్షర పరిమళ గ్రంధాన్ని ఆస్వాదిస్తూనే ఉన్నారు. ఎనిమిదేళ్లనాడు... ఆనాటి తెలంగాణ రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖామంత్రి తుమ్మల నాగేశ్వర రావు (Thummala Nageswara Rao) ప్రముఖ రచయిత పురాణపండ శ్రీనివాస్ (Puranapanda Srinivas) చేత ఒక మంత్రమయ భక్తి రసభరితమైన కథాకథన వ్యాఖ్యానాలతో కూడిన ‘పచ్చకర్పూరం’ (Pachhakarpooram Book) అనే గ్రంధాన్ని అద్భుతంగా రూపొందింపచేసి... నాటి తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ చదలవాడ కృష్ణమూర్తితో ఆవిష్కరింపచేశారు.

తిరుమల తిరుపతి దేవస్థానం సంప్రదాయం ప్రకారం బయటి సంస్థల, బయటి వ్యక్తుల గ్రంధాలను అనుమతించరు. అయితే ప్రముఖ రచయిత, జ్ఞానమహాయజ్ఞ కేంద్రం సంస్థాపకులు పురాణపండ శ్రీనివాస్ అద్భుత రచనల గురించి, ఆయన నిస్వార్ధ సేవ గురించీ తెలుసున్న దేవస్థాన అధికారులూ, పండితులూ నాటి తిరుమల తిరుపతి దేవస్థానం కార్య నిర్వహణాధికారి డాక్టర్ డి. సాంబ శివరావుకు వివరించడంతో ఆయన సంతోషం వ్యక్తం చేశారు. అంతే కాకుండా ఈ పచ్చకర్పూరం గ్రంధాన్ని చాలా విలువైన నాణ్యతలతో పూర్తిగా వర్ణమయంగా ముద్రించి... తామే సౌజన్యకర్తలుగా వ్యవహరించిన తుమ్మల నాగేశ్వరరావు, భ్రమరాంబ దంపతులు ఇరవై ఒక్క వేల ‘పచ్చకర్పూరం’ ప్రతులను తిరుమల తిరుపతి దేవస్థాన అధికారుల, అర్చక పండితుల సహకారంతో అక్కడి వేదపాఠశాల, అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్, ధర్మగిరి వేద పాఠశాల, అర్చక భవన్, పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం, శ్రీవారి ఆనంద నిలయం, శ్రీవేంకటేశ్వర విశ్వ విద్యాలయం, అలమేలు మంగాపురం, శ్రీనివాస మంగాపురం, గోవిందరాజ స్వామి ఆలయం, శంకరమఠం, జీయర్ మఠం, వైఖానస మఠం, పుష్పగిరి పీఠం, కంచి కామకోటి మఠం వంటి తిరుమల, తిరుపతిలలోని ఎందరో అయ్యవార్లకే కాకుండా... తిరుమలకు విచ్చేసిన వందల కొలది భక్తులకు తుమ్మల నాగేశ్వరరావు దంపతులు ఉచితంగా ఇవ్వడం ఎంతోమందికి ఆశ్చర్యపరిచింది, ఆనందపరించిందనేది నిర్వివాదాంశం.

Pachhakarpooram.jpg

పురాణపండ శ్రీనివాస్... ఈ పచ్చకర్పూరం గ్రంధంలో... ‘తిరుమల ప్రధాన దేవాలయంలోంచి బయటికి వచ్చేటప్పటికి తిరుమల గిరులపై సంధ్యాకాశంలో నెలవంక మధ్య ఊయలలూగే తిరునామాల పవిత్ర వయ్యారాన్ని వర్ణించిన సొగసైన భాషా సౌందర్యం మొదలుగా తిరుమల కొండల్లో ఆకుపచ్చని చెట్లమధ్య నుంచి ఉదయిస్తున్న సూర్య దేవుని చూస్తూ... ఆ రాగరంజిత సుప్రభాత వేళ శ్రీవేంకటేశ్వర సుప్రభాతాన్ని గానం చేస్తూంటే మాడ వీధులన్నీ గోవిందనామాలతో నిండిపోయిన ఘటనల విశేషాలతో పుస్తకం పేజీలు త్రిప్పుతుంటే.. మధ్య మధ్యన స్తోత్రాలు, పవిత్రమైన అద్భుత కధలు సాక్షాత్తూ తిరుమలేశుని మన కన్నులముందుకు తీసుకు వస్తాయని...’ ఆ తరువాత తిరుమల దర్శనానికి విచ్చేసిన పూర్వ కార్యనిర్వహణాధికారి, సీనియర్ ఐఏఎస్ అధికారి ఎల్వీ సుబ్రహ్మణ్యం సైతం ప్రశంసించడం తుమ్మలకు, పురాణపండకు ఒక ప్రశంసా పాత్రమేనని నిర్మొహమాటంగా చెప్పక తప్పదు.

ఇప్పుడీ విశేషాలెందుకంటే ఇటీవల శ్రీ వేంకటేశ్వర విశ్వ విద్యాలయంలో జరిగిన ఒక సెమినార్‌కు విచ్చేసిన కొందరు, ఆచార్యులు, పరిశోధక విద్యార్థులు ఎనిమిదేళ్లనాడు తుమ్మల నాగేశ్వర రావు ప్రచురించిన పురాణపండ శ్రీనివాస్ ‘పచ్చకర్పూరం’ గ్రంధంలో కొన్ని అంశాల్ని సభాముఖంగా ప్రస్తావించి.. ప్రశంసించడంతో... మరొకసారి ఈ పరమోత్తమమైన గ్రంధం హాట్ టాపిక్ అయ్యింది. ఈ విశేషాన్ని అప్పటికప్పుడు ప్రముఖ రచయిత పురాణపండకు ఫోన్‌లో ఒక ప్రొఫెసర్ తెలియపరిచగా... ‘తిరుమల రంగనాయకమంటపంలో వేదపండితుల మంత్ర ధ్వనుల మధ్య కప్పే శేష వస్త్రం’ ఎలాంటి అనిర్వచనీయ ఆనందానుభూతినిస్తుందో అదే అనుభూతి కలుగుతోందని పురాణపండ శ్రీనివాస్ ప్రొఫెసర్స్‌కి ఎంతో చక్కగా చెప్పి... ఈ పవిత్ర వైభవానికి శ్రీవారి అనుగ్రహంతో పాటు తుమ్మల నాగేశ్వర రావు సంకల్ప బలమే కారణమని, ఈ ప్రశంసలు తుమ్మలకే దక్కాలని శ్రీనివాస్ నిర్మొహమాటంగా చెప్పేసారుట. అదీ పురాణపండ శ్రీనివాస్ ధార్మిక నిబద్ధత అని అక్కడివారు అభినందించారుట కూడాను.

Thummala-Presentation.jpg

వెండి వాకిలి వద్ద ధ్వజ స్థంభం నుండి బంగారు వాకిలిలోకి ప్రవేశించి తొమ్మిదడుగుల స్వయంవ్యక్త సాలగ్రామ శిలామూర్తి మంగళమయ శ్రీనివాసుణ్ణి దర్శించుకునే నిమిషాల వర్ణనను పురాణపండ అమోఘంగా వర్ణించి పాఠకుల్ని చాలా ఆకట్టుకున్నారని... సప్తగిరి మాసపత్రిక ఉద్యోగి ఒకరు ఈ సెమినార్‌లో పచ్చకర్పూరం వైభవాన్ని అక్కడి పరిశోధక విద్యార్థులతో పంచుకోవడం విశేషం.

కథ మధ్య కథ, కథ వెనుక కథలతో, వైఖానస, పాంచరాత్ర ఆగమమంత్రాలతో, శ్రీవైష్ణవభరితంగా పురాణపండ రచనా సంకలనంగా అపురూపమైన విలువలతో అందిన ఈ పచ్చకర్పూరం గ్రంధం తుమ్మల నాగేశ్వరరావు, భ్రమరాంబ దంపతుల జీవన వైభవంలో ఒక పరమ పవిత్రమైన మేలిమలుపుగా పండిత అర్చక బృందాలు ఆనాటి నుండీ నేటివరకూ మంగళా శాసనాలు చేస్తూనే ఉన్నాయి.

మానవతావాదిగా, సహృదయ శీలిగా, సంస్కార వంతునిగా పేరున్న సీనియర్ రాజకీయ నాయకుడైన తుమ్మల నాగేశ్వరరావు ఇటీవల కాంగ్రెస్ పార్టీనుంచి ఘన విజయం సాధించి గౌరవ మంత్రి పీఠమెక్కాక వేంకటాద్రి శ్రీవారికో, యాదాద్రి నరసింహ స్వామివారికో మరొక అక్షయ, అక్షర తాంబూలం సమర్పిస్తే... అటు తుమ్మల వంశంకి, ఇటు తుమ్మల అనుచరులకూ పుణ్యం ఫలించి చరిత్రకెక్కినట్లే! ఈ దిశగా మరి శ్రీశైల దేవస్థానం పూర్వ ప్రత్యేక సలహాదారులు పురాణపండ శ్రీనివాస్ ఈసారి ఎంతటి ఘన పరిమళం అందిస్తారోనని వేద పండితులు బాహాటంగానే అంటున్నారు.

సహజంగా పురాణపండ శ్రీనివాస్ నిస్వార్ధ యజ్ఞ సేవ, అద్భుత రచనా సౌందర్యం, పరమాద్భుతమైన ముద్రణా వైభవం... ఇవన్నీ తుమ్మల నాగేశ్వరరావు అంకిత భావానికి ఒక వైభవ కిరీటంగా చెప్పక తప్పదు. ఇప్పటికే వేదాద్రి... యాదాద్రి.. ఇంద్రకీలాద్రి... తిరుమల... ద్వారకా తిరుమల.. అన్నవరం... కాణిపాకం... సింహాచలం.. శ్రీశైలం వంటి మహా పుణ్యక్షేత్రాలలో పురాణపండ శ్రీనివాస్ దైవీయ స్పృహల పవిత్ర గ్రంధాల వైభవం అదిరిపోతోందని అనేకమంది సాహితీవేత్తలు, రచయితలు, కవులు, కళాకారులు, అర్చకులు, వేద పండితులు, భక్తులు ముక్తకంఠంతో జయ ధ్వానంగా ఎలుగెత్తడం కన్నుల ముందే కనబడుతోన్న సత్యం.

Updated Date - May 24 , 2024 | 12:34 AM