Cultural Competitions : కాకినాడలో ఉత్సాహంగా క్రియ పిల్లల పండుగ
ABN , Publish Date - Dec 29 , 2024 | 04:13 AM
కాకినాడ జేఎన్‌టీయూ ఆవరణలో రాష్ట్రస్థాయి క్రియ పిల్లల పండుగ శనివారం ప్రారంభమైంది.

ఉభయ రాష్ట్రాల నుంచి 8,500 మంది విద్యార్థుల హాజరు
సర్పవరం జంక్షన్, డిసెంబరు 28(ఆంధ్రజ్యోతి): కాకినాడ జేఎన్‌టీయూ ఆవరణలో రాష్ట్రస్థాయి క్రియ పిల్లల పండుగ శనివారం ప్రారంభమైంది. ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల విద్యార్థుల్లోని సృతజనాత్మకతను వెలికితీసేందుకు శని, ఆదివారాల్లో నిర్వహిస్తున్న 11వ రాష్ట్రస్థాయి క్రియ అంతర పాఠశాలల సాంస్కృతిక పోటీలను కార్యదర్శి ఎస్‌ఎ్‌సఆర్ జగన్నాథరావు ప్రారంభించారు. ఈ పోటీలకు ముఖ్యఅతిథిగా విచ్చేసిన లోక్‌సత్తా వ్యవస్థాపకుడు, రిటైర్డ్ ఐఏఎస్ అధికారి జయప్రకాశ్ నారాయణ మాట్లాడుతూ విద్యార్థుల సర్వముఖాభివృద్ధికి విద్య, క్రీడలు, సాంస్కృతిక పోటీలు దోహదం చేస్తాయన్నారు. విద్యార్థుల్లో సృతజనాత్మకతను వెలికితీసి, వారి ఉజ్వల భవిష్యత్తుకు బాటలు వేస్తాయన్నారు. ఈ పోటీల్లో పాల్గొనేందుకు ఏపీ, తెలంగాణకు చెందిన 350 పాఠశాలల నుంచి 8,500 మంది విద్యార్థులు సాంస్కృతిక, క్విజ్, వ్యాసరచన తదితర పోటీల్లో పాల్గొన్నారు. సంస్థ ప్రెసిడెంట్ పాలిక శ్రీనివాస్, జగన్నాథరాజు తదితరులు పాల్గొన్నారు.