TS BJP : బీజేపీలోని KCR కోవర్టులను హైకమాండ్ ఏం చేయబోతోంది.. ఎంపీ లక్ష్మణ్ కామెంట్స్‌తో ఒక్కసారిగా...

ABN , First Publish Date - 2023-01-29T09:46:41+05:30 IST

తెలంగాణలోని అన్ని రాజకీయ పార్టీల్లో (Telangana Political Parties) సీఎం కేసీఆర్ (CM KCR) కోవర్టులు (Coverts), ఇన్‌ఫార్మర్లు..

TS BJP : బీజేపీలోని KCR కోవర్టులను హైకమాండ్ ఏం చేయబోతోంది.. ఎంపీ లక్ష్మణ్ కామెంట్స్‌తో ఒక్కసారిగా...

ఇంటర్నెట్ డెస్క్ : తెలంగాణలోని అన్ని రాజకీయ పార్టీల్లో (Telangana Political Parties) సీఎం కేసీఆర్ (CM KCR) కోవర్టులు (Coverts), ఇన్‌ఫార్మర్లు (Informers) ఉన్నారన్న కమలనాథుల (BJP Leaders) కామెంట్స్ కాషాయదళంలో తీవ్ర కలకలానికి దారితీశాయి. స్వయంగా ఎమ్మెల్యే, బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు ఈటల రాజేందరే (Etela Rajender) ఈ కామెంట్స్ (Comments) చేయడం మరింత చర్చకు దారితీసింది. ఎందుకంటే.. ఆయన టీఆర్ఎస్ (TRS) (ఇప్పుడు బీఆర్ఎస్ BRS ) నుంచి బయటికొచ్చి కాషాయం తీర్థం పుచ్చుకున్నారు గనుక అన్ని విషయాలు తెలిసే మాట్లాడుతున్నారని బీజేపీ పెద్దలు భావిస్తున్నారు. ఒకవేళ బీజేపీలో కేసీఆర్ కోవర్టులు, ఇన్‌ఫార్మర్లు ఉంటే ఏయే స్థాయిలో ఉన్నారు..? వారిని ఎలా గుర్తించాలనే దానిపై పార్టీలో కూడా చర్చ జరుగుతోందని తెలియవచ్చింది.

అసలు కథ ఇదేనా..!

కోవర్టుల విషయంలో అలర్ట్ అయిన బీజేపీ ముఖ్యులు (Bharatiya Janata Party) వారిని గుర్తించి, కట్టడి చేయడంపై ప్రత్యేక దృష్టిసారించారని తెలుస్తోంది. కోవర్టులను పక్కా ఆధారాలతో గుర్తించి కట్టడి చేయాలని.. అవసరమైతే అలాంటి నేతలను పక్కనపెట్టాలన్న ఆలోచనలో కూడా ఉన్నారని తెలియవచ్చింది. వాస్తవానికి ఈ కోవర్టుల వ్యవహారం మునుగోడు ఉపఎన్నికల (Munugodu By-Election) సమయంలోనే తెరపైకి వచ్చిన విషయం విధితమే. బీజేపీ తరఫున పోటీచేసిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి (Komatireddy Rajagopal Reddy) ఓటమికి కూడా కోవర్టులే కారణమనే ఆరోపణలు పెద్దఎత్తునే వచ్చాయి. బీజేపీ వ్యూహాలు, ఎత్తుగడలన్నీ కోవర్టులే.. గులాబీ పార్టీకి చేరవేశారనే టాక్ కూడా నడిచింది. అప్పట్లో కొందరు నేతలు బీఆర్ఎస్ పెద్దలు కేసీఆర్ (CM KCR), కేటీఆర్‌ల (Minister KTR) సమక్షంలో గులాబీ కండువాలు కప్పుకోవడంతో ఈ ఆరోపణలకు మరింత బలం చేకూరినట్లయ్యింది. తాజాగా.. ఈటల నోట కూడా కోవర్టులు, ఇన్‌ఫార్మర్ల వ్యాఖ్యలు రావడంతో ఇదంతా అక్షరాలా నిజమే అని తేలిపోయింది. అయితే.. బీజేపీలో దూకుడుగా ఉన్న ఈటల జాతీయ నాయకత్వం దృష్టిలో ఉండటంతో.. రాష్ట్ర నాయకత్వంలోని కొందరికి మింగుడు పడటం లేదని పార్టీ అంతర్గత వర్గాల్లో పెద్ద ఎత్తున చర్చ కూడా జరుగుతోందట.

Etela-Rajender.jpg

కోవర్టులు ఏం చేస్తారు..?

ఈ కోవర్టుల వ్యవహారంపై తెలంగాణ బీజేపీ కీలకనేత, రాజ్యసభ ఎంపీ లక్ష్మణ్ (BJP MP Laxman) స్పందిస్తూ హాట్ కామెంట్స్ చేశారు. కేసీఆర్ కోవర్టులు బీజేపీలో ఉండి చేసేదేమీ లేదని ఘాటు వ్యాఖ్యలు చేశారు. సరైన సమయంలో బీజేపీలోకి భారీగా చేరికలుంటాయని స్పష్టం చేశారాయన. బీజేపీ చేరికలపై ఆధారపడదని.. తెలంగాణపై ప్రధాని మోదీ (PM Modi) , అమిత్ షాలకు (Amit Shah) ప్రత్యేక వ్యూహముందని లక్ష్మణ్ తేల్చిచెప్పారు. ప్రధాని మోదీ తెలంగాణపై ప్రత్యేక దృష్టి సారించారని కూడా ఎంపీ తెలిపారు. మోదీ, అమిత్ షా, నడ్డాలు..‌ నెలకు ఒకసారి తెలంగాణలో పర్యటించబోతున్నారని చెప్పారు. లక్ష్మణ్ వ్యాఖ్యలు ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో పెద్ద హాట్ టాపిక్‌గానే మారాయి.

ముందస్తు ఎన్నికలపై..!

మంత్రి కేటీఆర్ ముందస్తు ఎన్నికలు, కేంద్ర నిధులపై చేసిన కామెంట్స్‌ పట్ల కూడా లక్ష్మణ్ రియాక్ట్ (Reaction) అవుతూ కౌంటర్ (Counter) ఇచ్చారు. లోకసభకు ముందస్తు (Loksabha) ఎన్నికలు కాదు.. జమిలి ఎన్నికలకు బీఆర్ఎస్‌కు సిద్ధమా? అని సవాల్ విసిరారు. తెలంగాణలో ముందస్తు ఎన్నికలొస్తే ఎదుర్కోవడానికి బీజేపీ సిద్ధంగా ఉందని స్పష్టం చేశారు. ఎన్నికల తర్వాత బీఆర్ఎస్-కాంగ్రెస్ (BRS-Congress) పార్టీలు కలుస్తాయని ఎంపీ (MP) జోస్యం చెప్పారు. కేంద్ర నిధులపై బీఆర్ఎస్ ఎంపీలతో పార్లమెంట్‌లో (Parliament) చర్చకు బీజేపీ సిద్ధంగా ఉందని.. మంత్రి కేటీఆర్ సిద్ధమా? అని ఛాలెంజ్ (Challange) చేశారు. తెలంగాణ సమస్యలపై బడ్జెట్ (Budget meetings) సమావేశాల్లో తప్పకుండా రాజ్యసభలో (Rajyasabha) ప్రస్తావిస్తానని లక్ష్మణ్ తెలిపారు.

BJP-Laxman.jpg

మొత్తానికి చూస్తే.. పార్టీలోని కోవర్టులు, ఇన్‌ఫార్మర్ల భరతం పట్టడానికి బీజేపీ పెద్దలు (BJP High command) అయితే ప్రత్యేక దృష్టి సారించారు. కోవర్టులుగా ఎవరు తేలుతారో.. తేలిన తర్వాత హైకమాండ్ ఏం చేస్తుందనే విషయాలు తెలియాల్సి ఉంది. ఒకవేళ ముందుగానే కోవర్టులు పార్టీని వీడినా వీడొచ్చని తెలంగాణ రాజకీయాల్లో (TS Politics) చర్చ జరుగుతోంది. ఫైనల్‌గా తెలంగాణ బీజేపీలో (TS BJP) ఏం జరుగుతుందో.. ఎన్నెన్ని మార్పులు (Changes) చోటుచేసుకుంటాయో వేచి చూడాలి మరి.

Updated Date - 2023-01-29T10:03:55+05:30 IST