Share News

Revanthreddy: సింగరేణి కార్మికులతో రేవంత్ గేట్ మీటింగ్... బీఆర్‌ఎస్‌పై విరుచుకుపడ్డ టీపీసీసీ చీఫ్

ABN , First Publish Date - 2023-10-19T09:53:53+05:30 IST

భూపాలపల్లిలోని 1 ఇంక్లైన్ గేట్ దగ్గర సింగరేణి కార్మికులతో టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి గురువారం ఉయదం గేట్ మీటింగ్ నిర్వహించారు. కార్మికుల సమస్యలను రేవంత్ అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా టీపీసీసీ చీఫ్ మాట్లాడుతూ.. తెలంగాణ సాధనలో సింగరేణి కార్మికులు ప్రత్యక్ష భాగస్వాములన్నారు.

Revanthreddy: సింగరేణి కార్మికులతో రేవంత్ గేట్ మీటింగ్... బీఆర్‌ఎస్‌పై విరుచుకుపడ్డ టీపీసీసీ చీఫ్

జయశంకర్ భూపాలపల్లి: భూపాలపల్లిలోని 1 ఇంక్లైన్ గేట్ దగ్గర సింగరేణి కార్మికులతో టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి (TPCC Chief Revanth Reddy) గురువారం ఉయదం గేట్ మీటింగ్ నిర్వహించారు. కార్మికుల సమస్యలను రేవంత్ అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా టీపీసీసీ చీఫ్ మాట్లాడుతూ.. తెలంగాణ సాధనలో సింగరేణి కార్మికులు ప్రత్యక్ష భాగస్వాములన్నారు. జెండాలను ఎజెండాలను పక్కనబెట్టి అంతా ఏకమైతే తెలంగాణ సాకారమైందని చెప్పుకొచ్చారు. కార్మికుల త్యాగాన్ని బీఆర్‌ఎస్ ప్రభుత్వం మరిచిపోయిందని విమర్శించారు. ‘‘సకలజనుల సమ్మెలో మీరు భాగస్వాములు కాకపోతే.. తెలంగాణ సాకరమయ్యేదా?. కార్మికుల వైపు ఉన్నామనేది వాళ్లే, ప్రభుత్వంలో ఉన్నది వాళ్లే. సమస్యలు పరిష్కరించకుండా జాప్యం చేస్తున్నది వాళ్లే. ఒకే ఒక్క అధికారిని సింగరేణికి పెట్టి దివాళా తీయించారు. వారి తప్పులను కప్పిపుచ్చుకుంటున్నారు. సింగరేణిని ప్రేవేటుపరం చేయడంలో బీఆర్‌ఎస్ ఒప్పుకుంది నిజం కాదా. అరబిందోకు మైన్ అప్పగించింది నిజం కాదా. తాడిచర్ల మైన్‌ను నీ అనుయాయులకు అప్పగించింది నిజం కాదా. నైని కోల్ మైన్‌ను ఆదానీకి కట్టబెట్టాలని చూసింది నిజం కాదా. మైన్‌ను ప్రైవేట్‌పరం చేయడాన్ని అడ్డుకున్నది మేం కాదా. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే కార్మికుల సమస్యలు పరిష్కరిస్తాం. సింగరేణి ఎన్నికలను జరపకుండా కేసీఆర్ ఎందుకు తప్పించుకుంటున్నారు. జెన్‌కో బిల్లులు కట్టి ఉంటే, ఓపెన్ కాస్ట్ మైన్‌లు ప్రవేటుపరం చేయకుండా ఉంటే ఎన్నికలు జరిపేవారు కాదా’’ అంటూ రేవంత్ ప్రశ్నల వర్షం కురిపించారు.


డిసెంబర్ 27న సింగరేణి ఎన్నికలు జరగాలంటే డిసెంబట్ 3న కాంగ్రెస్ అధికారంలోకి రావాలన్నారు. తెలంగాణ సాధించిన కార్మికులుగా మిమ్మల్ని గుర్తించాల్సిన బాధ్యత ప్రభుత్వాలదని తెలిపారు. తెలంగాణను గుల్ల చేసిన ఈ పందికొక్కుల పని పెట్టాల్సిన బాధ్యత సింగరేణి కార్మికులపై ఉందని.. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే సింగరేణి కార్మికుల సమస్యలు యుద్ధ ప్రాతిపదికన పరిష్కరిస్తుందని అని రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు.

Updated Date - 2023-10-19T09:53:53+05:30 IST