KTR: కమలాపుర్ చేరుకున్న మంత్రి కేటీఆర్... భారీ బందోబస్తు

ABN , First Publish Date - 2023-01-31T12:28:03+05:30 IST

జిల్లాలో మంత్రి కేటీఆర్ పర్యటన కొనసాగుతోంది.

KTR: కమలాపుర్ చేరుకున్న మంత్రి కేటీఆర్... భారీ బందోబస్తు

హనుమకొండ: జిల్లాలో మంత్రి కేటీఆర్ (Telangana Minister KTR) పర్యటన కొనసాగుతోంది. కాసేపటి క్రితమే హుజురాబాద్ నియోజకవర్గంలోని కమలాపూర్‌కు మంత్రి హెలికాఫ్టర్‌లో చేరుకున్నారు. ఈ సందర్భంగా కేటీఆర్‌ (KTR)కు బీఆర్‌ఎస్ శ్రేణులు (BRS Leaders) ఘన స్వాగతం పలికారు. పర్యటనలో భాగంగా కమలాపూర్ మండలంలో రూ.49 కోట్ల నిధులతో చేపట్టిన పలు అభివృద్ధి కార్యక్రమాలకు మంత్రి శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయనున్నారు. ఎమ్‌జేపీ బాలికల/బాలుర గురుకుల పాఠశాల పనులకు మరికొద్దిసేపట్లో మంత్రి ప్రారంబోత్సవం చేయనున్నారు. అనంతరం విద్యార్థులతో కలసి మధ్యాహ్న భోజనం చేస్తారు. కేటీఆర్ వెంట మంత్రులు ఎర్రబెల్లి దయాకర్ రావు (Errabelli Dayakar Rao), గంగుల కమలాకర్ (Gangula Kamalakar)ఉన్నారు. కేటీఆర్ పర్యటన సందర్భంగా పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు.

ప్రోటోకాల్ రగడ...

హనమకొండలో కేటీఆర్ పర్యటన (KTR Tour in Hanmakonda) సందర్భంగా ఏర్పాటు చేసిన ఫెక్సీ (Heavy Flexys) లతో ప్రోటోకాల్ రగడ చోటు చేసుకుంది. కమలాపూర్‌లో కేటీఆర్ టూర్ నేపథ్యంలో భారీగా ఫ్లెక్సీలు ఏర్పాటయ్యాయి. అడుగడుగునా ఎమ్మెల్సీ పాడి కౌశిక్ రెడ్డి (MLC Padi Koushik Reddy)ప్లెక్సీలు, కటౌట్లు దర్శనమిచ్చాయి. అయితే ప్లెక్సీలలో నియోజకవర్గ ఇంచార్జీ గెల్లు శ్రీనివాస్ (Gellu Srinivas) ఫోటో ఎక్కడా కనిపించని పరిస్థితి. అటు అధికారిక కార్యక్రమాలకు స్థానిక ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌ (BJP MLA Etela Rajender)కు ఆహ్వానం అందలేదు. అధికారిక కార్యక్రమాల్లో ఏర్పాటు చేసిన ప్లెక్సీల్లో ఈటల రాజేందర్ ఫోటో లేకపోవడంతో ఫ్రోటో కాల్ రగడ నెలకొంది.

ముందస్తు అరెస్ట్‌లు...

కమలాపూర్ బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ సొంత ఊరు కావడంతో అడ్డుకుంటారన్న అనుమానంతో బీజేపీ నేతలను పోలీసులు ముందస్తుగా అరెస్ట్ చేశారు. అరెస్టులపై విపక్ష నేతలు భగ్గుమంటున్నారు. కేటీఆర్ పర్యటన సందర్భంగా భారీగా పోలీసులు మోహరించారు. వరంగల్ సీపీ రంగనాథ్ భద్రతను పర్యవేక్షిస్తున్నారు.

Updated Date - 2023-01-31T12:32:18+05:30 IST