Share News

Mahmood Ali : కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ప్రతి సంవత్సరం ముఖ్యమంత్రి మారతారు

ABN , First Publish Date - 2023-10-20T19:07:33+05:30 IST

కాంగ్రెస్ పార్టీ (Congress party) అధికారంలోకి వస్తే ప్రతి సంవత్సరం ముఖ్యమంత్రి మారతారని హోం మంత్రి మహమూద్ అలీ (Home Minister Mahmood Ali) ఎద్దేవ చేశారు.

Mahmood Ali : కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ప్రతి సంవత్సరం ముఖ్యమంత్రి మారతారు

హనుమకొండ: కాంగ్రెస్ పార్టీ (Congress party) అధికారంలోకి వస్తే ప్రతి సంవత్సరం ముఖ్యమంత్రి మారతారని హోం మంత్రి మహమూద్ అలీ (Home Minister Mahmood Ali) ఎద్దేవ చేశారు. శుక్రవారం నాడు హనుమకొండ జిల్లాలో పర్యటించారు. బీఆర్ఎస్ కార్యాలయంలో కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మహమూద్ అలీ మాట్లాడుతూ...‘‘ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు ముందు అన్ని సమస్యలే ఉన్నాయి. ఉమ్మడి రాష్ట్రంలో అప్పట్లో చాలా ప్రాంతాలు ఫ్లోరోసిస్‌తో బాధ పడేవి. కానీ ఇప్పుడు ప్రతి ఇంటికి మంచి నీరు అందిస్తున్నాం, భూముల రేట్లు పెరిగాయి, క్రైమ్ రేట్ తగ్గింది. అన్ని వర్గాల ప్రజలు సంతోషంగా ఉన్నారు. కాంగ్రెస్ పార్టీలో లీడర్లు లేకపోవడంతో రేవంత్‌రెడ్డిని టీపీసీసీ చీఫ్ చేశారు. రేవంత్‌రెడ్డి RSS కార్యకర్త. కర్ణాటక ఎన్నికల్లో బీజేపీ... హిందు - ముస్లింల మధ్య గొడవలు పెట్టింది. రాబోయే ఎన్నికల్లో భారీ మెజారిటీతో వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యేగా వినయ్ భాస్కర్ గెలుస్తారు’’ అని హోంమంత్రి మహమూద్ అలీ తెలిపారు.

Updated Date - 2023-10-20T19:07:33+05:30 IST