Vinay Bhaskar: ‘కవితను అరెస్ట్ చేస్తే వరంగల్ భగ్గుమంటుంది’

ABN , First Publish Date - 2023-03-16T11:38:42+05:30 IST

బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితను నేడు అరెస్ట్ చేస్తారంటూ వస్తున్న వార్తలను ప్రభుత్వ చీఫ్ విప్ వినయ్ భాస్కర్ తీవ్రంగా ఖండించారు.

Vinay Bhaskar: ‘కవితను అరెస్ట్ చేస్తే వరంగల్ భగ్గుమంటుంది’

వరంగల్: బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత (BRS MLC Kavitha)ను నేడు అరెస్ట్ చేస్తారంటూ వస్తున్న వార్తలను ప్రభుత్వ చీఫ్ విప్ వినయ్ భాస్కర్ (Government Chief Whip Vinay Bhaskar) తీవ్రంగా ఖండించారు. కవితను అరెస్ట్ చేస్తే వరంగల్ భగ్గుమంటుందని హెచ్చరించారు. గురువారం మీడియాతో మాట్లాడుతూ.. బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ (BJP Leader Bandi Sanjay) మహిళలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. బీజేపీ పాలనలో ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడిందన్నారు. సీబీఐ, ఈడీ, ఐటీ బీజేపీ జేబు సంస్థలుగా మారాయని విమర్శలు గుప్పించారు. దేశ సంపదను దోచుకుంటున్న అంబానీ, అదానీలపై ఈడీ, సీబీఐ, ఐటీ దాడులు చేయాలన్నారు. మహిళా రిజర్వేషన్ కోసం పోరాడుతున్న ఎమ్మెల్సీ కవితను ఈడీతో బెదిరిస్తున్నారని ఆరోపించారు. కవితను ఇబ్బందిపెడితే దేశప్రజలు తిరగబడతారన్నారు. బీజేపీ (BJP)కి వ్యతిరేకంగా మాట్లాడితే చాలు జేబుసంస్థలను ఉసిగొల్పుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. బాలవికాస లాంటి స్వచ్ఛంద సంస్థలపై కూడా రైడ్స్ చేయించటం బాధాకరమన్నారు. రైతు సమస్యలపై ఉద్యమం చేస్తుంటే.. రైతులను ఉగ్రవాదులుగా, దేశద్రోహులుగా చిత్రీకరిస్తున్నారని అన్నారు. ఈనెల 23న హనుమకొండలో మంత్రి కేటీఆర్ పర్యటించనున్నట్లు వినయ్ భాస్కర్ పేర్కొన్నారు.

Updated Date - 2023-03-16T11:39:03+05:30 IST