TSPSC paper leak: అసిస్టెంట్ ఇంజినీర్ పరీక్షపై తేల్చేసిన టీఎస్‌పీఎస్సీ
ABN , First Publish Date - 2023-03-15T22:04:25+05:30 IST
పేపర్ లీకేజీ వ్యవహారం నేపథ్యంలో అసిస్టెంట్ ఇంజినీర్ పరీక్ష రద్దుపై టీఎస్‌పీఎస్సీ కీలక నిర్ణయం తీసుకుంది...
హైదరాబాద్: అసిస్టెంట్ ఇంజినీర్ పరీక్షను రద్దు చేస్తున్నట్టు టీఎస్‌పీఎస్సీ (TSPSC) ప్రకటించింది. త్వరలోనే పరీక్ష తేదీని ప్రకటిస్తామని అధికారులు తెలిపారు. కాగా ఈనెల 5న అసిస్టెంట్ ఇంజినీరింగ్ పరీక్ష జరిగింది. మొత్తం 55 వేల మంది అభ్యర్థులు పరీక్ష రాశారు. ఇంజనీరింగ్ విభాగాల్లో 837 పోస్టుల భర్తీకి ఈ పరీక్ష జరిగింది. కాగా పేపర్ లీక్ వ్యవహారం నేపథ్యంలో టీఎస్‌పీఎస్సీ ఈ నిర్ణయం తీసుకుంది.
కాగా టీఎస్‌పీఎస్సీ ఉన్నతాధికారులతో (TSPSC officials) సిట్ అధికారి ఏఆర్ శ్రీనివాస్ (SIT officer AR Srinivas) బుధవారం భేటీ అయ్యారు. పరీక్షల నిర్వహణ, సీక్రెసీతో పాటు ప్రింటింగ్ వ్యవహారాలపై ఆరా తీసినట్లు తెలుస్తోంది. కాన్ఫిడెన్షియల్ రూమ్‌ను సిట్ అధికారి ఏఆర్ శ్రీనివాస్ పరిశీలించారు. కాన్ఫిడెన్షియల్ రూమ్ నుంచి పేపర్ బయటికి వెళ్లినట్లు గుర్తించారు. కాన్ఫిడెన్షియల్ రూమ్ ఇన్‌చార్జ్ శంకర్‌లక్ష్మిని పోలీసులు ప్రశ్నించారు. శంకర్‌లక్ష్మి దగ్గర ఉన్న పాస్‌వర్డ్, ఐడీలను ప్రవీణ్ చోరీ చేసినట్లు పోలీసులు చెప్పారు. నిందితుడు ప్రవీణ్ ఏఈ పేపర్స్‌ను పెన్‌డ్రైవ్‌లోకి ట్రాన్స్‌ఫర్ చేసుకున్నట్లు పోలీసులు పేర్కొన్నారు.