BRS: సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా సహాయం అందిస్తున్నాం: మంత్రి హరీష్

ABN , First Publish Date - 2023-03-26T17:18:20+05:30 IST

124 మందికి సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా సహాయం అందిస్తున్నామని మంత్రి హరీష్ (Harish Rao) రావు అన్నారు. 6735మందికి నియోజక వర్గ వ్యాప్తంగా ఇప్పటివరకు సీఎం (CM) రిలీఫ్ ఫండ్ సహయం అందించామని తెలిపారు.

BRS: సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా సహాయం అందిస్తున్నాం: మంత్రి హరీష్

సిద్దిపేట: 124 మందికి సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా సహాయం అందిస్తున్నామని మంత్రి హరీష్ (Harish Rao) రావు అన్నారు. 6735మందికి నియోజక వర్గ వ్యాప్తంగా ఇప్పటివరకు సీఎం (CM) రిలీఫ్ ఫండ్ సహయం అందించామని తెలిపారు. జిల్లా కేంద్రంలోని మంత్రి క్యాంప్ కార్యాలయంలో సీఎం రిలీఫ్ ఫండ్, సుకన్య సమృద్ది చెక్కుల పంపిణీ కార్యక్రమంలో మంత్రి హరీష్ రావు పాల్గొన్నారు. పార్టీ సభ్యులు ప్రమాద వశాత్తూ చనిపోతే పార్టీ సభ్యత్వం ఇన్సూరెన్స్ ద్వారా ఇప్పటి వరకు 44మందికి 90లక్షల రూపాయలు సహాయం అందించినట్లు వెల్లడించారు. 38మంది రైతులకు అసైన్డ్ భూమి పట్టాలు పంపిణీ చేస్తున్నామన్నారు. తమ ప్రభుత్వం పేదల సంక్షేమం కోసం పనిచేసే ప్రభుత్వమన్నారు.

Updated Date - 2023-03-26T17:18:22+05:30 IST