Sonia Promises : తెలంగాణ మహిళలకు తియ్యటి శుభవార్త చెప్పిన సోనియా

ABN , First Publish Date - 2023-09-17T18:53:46+05:30 IST

రంగారెడ్డి జిల్లా తుక్కుగూడలో కాంగ్రెస్ నిర్వహించిన విజయభేరి సభలో ఆ పార్టీ ఆరు గ్యారెంటీ హామీలను ప్రకటించింది. కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీ ఈ హామీలను ప్రకటించారు.

Sonia Promises : తెలంగాణ మహిళలకు తియ్యటి శుభవార్త చెప్పిన సోనియా

రంగారెడ్డి జిల్లా తుక్కుగూడలో కాంగ్రెస్ నిర్వహించిన విజయభేరి సభలో ఆ పార్టీ ఆరు గ్యారెంటీ హామీలను ప్రకటించింది. కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీ ఈ హామీలను ప్రకటించారు. తెలంగాణలో రానున్న ఎన్నికల్లో అధికారమే టార్గెట్ గా దూసుకెళ్తున్న కాంగ్రెస్ మహిళా ఓటర్లే మెయిన్ టార్గెట్ గా మెజారిటీ హామీలు ప్రకటించినట్లు తెలుస్తోంది. ఆరు గ్యారంటీ హామీలతో పాటు సోనియాగాంధీ ప్రకటించిన మొత్తం ప్రకటించిన హామీల లిస్టు ఇదే..


Sonia-Gandhi.jpg

కీలక ప్రకటనలు ఇవే

  • మహాలక్ష్మీ పథకం ద్వారా పేద మహిళలకు నెలకు రూ.2 వేల 500 ఆర్థిక సాయం

  • రూ.500 లకే గ్యాస్ సిలిండర్

  • ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు రాష్ట్ర వ్యాప్తంగా ఉచిత ప్రయాణం

  • ఇళ్లు లేని వారికి ఇంటి నిర్మాణానికి రూ.5 లక్షల సాయం

  • ఉద్యమకారుల కుటుంబాలకు 250 చ.గజాల ఇంటి స్థలం

  • రైతు భరోసా ద్వారా రైతులు, కౌలు రైతులకు ఏటా రూ.15 వేల పంట పెట్టుబడి సాయం

  • వ్యవసాయం కూలీలకు ఏడాదికి రూ.12 వేల సాయం. వరి పంటకు ప్రతి క్వింటాల్ కు రూ.500 బోనస్

  • గృహజ్యోతి కింద ప్రతి కుటుంబానికి 200 యూనిట్ల వరకు ఉచిత కరెంటు

  • చేయూత పథకం ద్వారా నెలకు రూ.4 వేల పింఛన్

  • రాజీవ్ ఆరోగ్య శ్రీ లిమిట్ రూ.10 లక్షల వరకు పెంపు

Updated Date - 2023-09-17T18:57:33+05:30 IST