TSPSC: టీఎస్పీఎస్సీ పేపర్ లీక్‌ కేసులో ముగిసిన నిందితుల సిట్‌ కస్టడీ.. వెలుగులోకి కీలక విషయాలు..

ABN , First Publish Date - 2023-03-28T17:37:31+05:30 IST

టీఎస్పీఎస్సీ పేపర్ లీక్‌ కేసులో (TSPSC Paper Leakage Case)నిందితులకు సిట్‌ కస్టడీ ముగిసింది.

TSPSC: టీఎస్పీఎస్సీ పేపర్ లీక్‌ కేసులో ముగిసిన నిందితుల సిట్‌ కస్టడీ.. వెలుగులోకి కీలక విషయాలు..

హైదరాబాద్: టీఎస్పీఎస్సీ పేపర్ లీక్‌ కేసులో (TSPSC Paper Leakage Case) నిందితులకు సిట్‌ కస్టడీ ముగిసింది. ప్రవీణ్, రాజశేఖర్, డాక్యా, రాజేశ్వర్‌కు కస్టడీ ముగిసినట్లు ఈడీ అధికారులు తెలిపారు. నలుగురు నిందితులను నాంపల్లి కోర్టులో హాజరుపర్చామని ప్రత్యేక దర్యాప్తు బృందం (SIT) అధికారులు పేర్కొన్నారు. విచారణలో నిందితులు సిట్ అధికారులకు కీలక విషయాలు చెప్పినట్లు తెలుస్తోంది.

టీఎస్‌పీఎస్సీ పేపర్ లీకేజీ కేసులో నలుగురు నిందితులను మూడో రోజు విచారణలో భాగంగా మంగళవారం ఉదయం నిందితులు ప్రవీణ్, రాజశేఖర్, డాక్యా, రాజేశ్వర్‌లను పోలీసులు సిట్ కార్యాలయానికి (SIT Office) తీసుకొచ్చారు. ఈ కేసులో ఇప్పటికే సిట్ అధికారులు 15 మందిని అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. తాజాగా మరో ఇద్దరిని అదుపులోకి తీసుకొని సిట్ విచారించింది. ఏఈ ప్రశ్నాపత్ర లీకేజీ నిందితులు డాక్యా అండ్ టీం ఎంతమందికి పేపర్ అమ్మారనే విషయాలు రాబట్టే పనిలో సిట్ అధికారులు ఉన్నారు. రేణుక, డాక్యా నుంచి ఉమ్మడి మహబూబ్‌నగర్‌కు అత్యధికంగా ప్రశ్నాపత్రాలు వెళ్లినట్లు పోలీసులు గుర్తించారు.

లీకేజ్‌లో భాగంగా చైన్ ప్రాసెస్‌పై సిట్ లోతుగా దర్యాప్తు చేస్తోంది. అక్టోబర్ 1న శంకర్ లక్ష్మి డైరీలో పాస్ వర్డ్‌ను ప్రవీణ్ కొట్టేసినట్లు తెలిసింది. గ్రూప్ 1, ఏఈ, టౌన్ ప్లానింగ్ పేపర్లు అన్ని అక్టోబర్‌లోనే ప్రవీణ్, రాజశేఖర్ కొట్టేసినట్లు సిట్ గుర్తించింది.

Updated Date - 2023-03-28T18:01:10+05:30 IST