Owaisi కళ్లలో ఆనందం కోసమేనట.. తాజ్‌మహల్ లాంటి సచివాలయం..!
ABN , First Publish Date - 2023-02-10T12:50:43+05:30 IST
హైదరాబాద్‌లో నూతన సచివాలయ నిర్మాణం పూర్తైంది. హైదరాబాద్‌కే తలమానికంగా ఆ నిర్మాణం జరిగింది. దానిని విపక్షాలు తాజ్‌మహల్‌తో పోల్చుతున్నాయి. అసలు అటుగా వెళ్లే వారు కళ్లు తిప్పుకోలేరంటే నమ్మి తీరాల్సిందే. అయితే అలాంటి తాజ్ మహల్ లాంటి నిర్మాణాన్ని తెలంగాణ ప్రభుత్వం కేవలం ఎంఐఎం నేత అసదుద్దీన్ ఒవైసీ కళ్ళల్లో ఆనందం కోసమే నిర్మించిందని..
Hyderabad : హైదరాబాద్‌లో నూతన సచివాలయ (New Secretariat) నిర్మాణం పూర్తైంది. హైదరాబాద్‌కే తలమానికంగా ఆ నిర్మాణం జరిగింది. దానిని విపక్షాలు తాజ్‌మహల్ (Tajmahal)తో పోల్చుతున్నాయి. అసలు అటుగా వెళ్లే వారు కళ్లు తిప్పుకోలేరంటే నమ్మి తీరాల్సిందే. అయితే అలాంటి తాజ్ మహల్ లాంటి నిర్మాణాన్ని తెలంగాణ ప్రభుత్వం (Telangana Government) కేవలం ఎంఐఎం నేత, ఎమ్మెల్యే అసదుద్దీన్ ఒవైసీ కళ్ళల్లో ఆనందం కోసమే నిర్మించిందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ (Bandi Sanjay) ఆరోపించారు. నేడు ఆయన మీడియాతో మాట్లాడుతూ.. మంత్రి కేటీఆర్ (Minister KTR)కు దమ్ముంటే ఓల్డ్ సిటీలో రోడ్ పక్కన ఉన్న గుళ్ళు, మసీదు లు కుల్చటం మొదలు పెట్టాలని సవాల్ విసిరారు. అసద్ కళ్ళల్లో ఆనందం కోసమే కేసీఆర్ (CM KCR) తాజ్ మహల్ నమూనాలో కొత్త సచివాలయం నిర్మించారని ఆరోపించారు.
రాష్ట్ర ముఖ్యమంత్రి అవినీతిని, కుటుంబ పాలనను ప్రజల్లోకి కార్నర్ మీటింగ్ ల ద్వారా తీసుకు వెళతామని బండి సంజయ్ స్పష్టం చేశారు. ప్రజలను పట్టించుకునే పరిస్థితిలో కేసీఆర్ లేడని.. ప్రశ్నిస్తే జైల్లో పెడుతున్నారని విమర్శించారు. నిరుద్యోగ భృతి ఇవ్వట్లేదని.. ఉద్యోగులకు సరైన సమయంలో జీతాలు కూడా ఇవ్వట్లేదన్నారు. 60% రెవిన్యూ వచ్చే హైదరాబాద్‌ను సీఎం కేసీఆర్ ఏమి అభివృద్ధి చేశారో చెప్పాలని బండి సంజయ్ నిలదీశారు. కేంద్ర ప్రభుత్వ నిధులతోనే అభివృద్ధి జరుగుతోందన్నారు. 60% నిధులు ఇస్తున్న హైదరాబాద్‌ను ఏ రకంగా అభివృద్ధి చేశారో కేసీఆర్ ప్రజలకు చెప్పాలన్నారు. కేంద్రం నిధులు ఇచ్చినా.. ఇవ్వలేదని కేంద్ర పైన ఆసత్య ప్రచారాలు చేస్తున్నారన్నారు. తెలంగాణ ప్రజలకు ఇచ్చిన హామీలను కెసిఆర్ నెరవేర్చలేదన్నారు. ప్రధానమంత్రి అవాస్ యోజన పథకాన్ని, ఫసల్ బీమా యోజన పథకాన్ని కేసీఆర్ అమలు చేయడం లేదని బండి సంజయ్ పేర్కొన్నారు.