RS Praveen Kumar: మంత్రి జగదీష్‌రెడ్డికి ఆ విషయంలో భయం పట్టుకుంది

ABN , First Publish Date - 2023-09-05T16:41:37+05:30 IST

బీసీ నేత వట్టే జానయ్య(Vatte Janaiah)ను చూసి మంత్రి జగదీష్‌రెడ్డికి(Minister Jagdish Reddy) భయం పట్టుకుందని బీఎస్పీ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్(RS Praveen Kumar) అన్నారు.

RS Praveen Kumar:  మంత్రి జగదీష్‌రెడ్డికి ఆ విషయంలో భయం పట్టుకుంది

సూర్యాపేట : బీసీ నేత వట్టే జానయ్య(Vatte Janaiah)ను చూసి మంత్రి జగదీష్‌రెడ్డికి(Minister Jagdish Reddy) భయం పట్టుకుందని బీఎస్పీ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్(RS Praveen Kumar) అన్నారు. మంగళవారం నాడు సూర్యాపేట(Suryapet)లో పర్యటించారు. ఉమ్మడి నల్గొండ జిల్లా డీసీఎంఎస్ చైర్మన్ వట్టే జానయ్య యాదవ్ కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఈసందర్భంగా ప్రవీణ్ కుమార్ మీడియాతో మాట్లాడుతూ..సూర్యాపేటకు వస్తుంటే అడుగడుగునా పోలీసులతో అరెస్టులు చేయిస్తున్నారని మండిపడ్డారుు. గాంధీనగర్ కాశ్మీర్‌లో ఉందా తెలంగాణలో ఉందా అని ప్రశ్నించారు. జానయ్య కొడుకు పెళ్లికి 50వేల మంది వస్తే బీసీ బిడ్డ ఇంటికి 50 వేల మంది ఎలా వస్తారని మంత్రి జగదీష్‌రెడ్డికి భయం పట్టుకుందన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీలు బానిస బతులులుగా బతకాలని రెడ్లు శాసిస్తున్నారని చెప్పారు.పోలీసులు అధికార పార్టీకి వత్తాసు పలుకుతున్నారని.. అరెస్ట్ చేయమంటే చేస్తున్నారు, కేసులు పెట్టమంటే పెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసులు సిగ్గుతో తలదించుకోవాల్సిన పరిస్థితి తెలంగాణలో ఉందన్నారు. బీఆర్ఎస్ పార్టీలోని డీసీఎంఎస్ చైర్మన్, అతని భార్య అజ్ఞాతంలోకి వెళ్లిపోతే సీఎం కేసీఆర్, డీజీపీ, హోంమంత్రి ఎక్కడున్నారు, ఏమి చేస్తున్నారు...? అని ప్రశ్నించారు. వట్టే జానయ్యను మంత్రి జగదీష్‌రెడ్డి మనుషులు చంపాలని ప్రయత్నాలు చేస్తున్నారని చెప్పారు. జానయ్యకు ఏమైనా జరిగితే చూస్తు ఊరుకోమని హెచ్చరించారు. 30వేల ఎకరాల బీసీ, ఎస్సీ, ఎస్టీ భూములు తీసుకొని రూ.100 కోట్లకు అమ్ముకున్న కేసీఆర్‌పై కేసులు పెట్టాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

Updated Date - 2023-09-05T16:41:37+05:30 IST