Batti Vikramarka: నల్గొండ జిల్లాలో ఒక్క ఎకరానికైనా నీరు ఇచ్చారా?
ABN , First Publish Date - 2023-06-08T15:29:45+05:30 IST
కాంగ్రెస్ హయాంలో తెచ్చిన 2013 భూ నిర్వాసితుల చట్టంలో భూ నిర్వాసితులకు అన్ని సదుపాయాలు పొందుపర్చామని కాంగ్రెస్ నేత భట్టి విక్రమార్క తెలిపారు. గురువారం మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రం మొత్తం భూ నిర్వాసితుల సమస్యలు ఉన్నాయన్నారు.
నల్గొండ: కాంగ్రెస్ హయాంలో తెచ్చిన 2013 భూ నిర్వాసితుల చట్టంలో భూ నిర్వాసితులకు అన్ని సదుపాయాలు పొందుపర్చామని కాంగ్రెస్ నేత భట్టి విక్రమార్క (Congress Leader Batti Vikramarka) తెలిపారు. గురువారం మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రం మొత్తం భూ నిర్వాసితుల సమస్యలు ఉన్నాయన్నారు. భూ రికార్డులను భద్రపరిచే రెవెన్యూ చట్టాన్ని చిన్నాభిన్నం చేశారని మండిపడ్డారు. కాంగ్రెస్ హయాంలో ఎస్ఎల్ బీసీ సొరంగం పనులు 30 కిలో మీటర్లు చేపడితే బీఆర్ఎస్ తొమ్మిదేళ్ళ పాలనలో 3 కిలోమీటర్లు తవ్వారన్నారు. తొమ్మిదేళ్ళ పాలనలో నల్గొండ జిల్లాకు ఒక్క ఎకరానికైనా నీరు ఇచ్చారా... ఏమి సాధించారని సాగునీటి ఉత్సవాలు అని ప్రశ్నించారు. పాలకులు కాంగ్రెస్ హయాంలో కట్టిన ప్రాజెక్టుల వద్ద ఫోటోలు దిగుతున్నారన్నారు. ఎంపీగా, ఎమ్మెల్సీగా, మండలి చైర్మన్‌గా గుత్తా ఏమి తెచ్చారని.. ప్రగతి భవన్ మెట్లు ఎక్కడానికి, కేసీఆర్‌ను కలవడానికి భయపడతారని భట్టి విక్రమార్క వ్యాఖ్యలు చేశారు.