Share News

Kotha Prabhakarreddy: బీఆర్‌ఎస్ ఎంపీ కొత్త ప్రభాకర్‌ రెడ్డిపై కత్తితో దాడి

ABN , First Publish Date - 2023-10-30T13:58:10+05:30 IST

ఎన్నికల ప్రచారంలో ఉన్న బీఆర్ఎస్ అభ్యర్ధి కొత్త ప్రభాకర్‌రెడ్డిపై కత్తితో దాడి తీవ్ర కలకలం రేపింది. సోమవారం ఉదయం సిద్దిపేట జిల్లా దౌల్తాబాద్ మండలం సూరంపల్లి గ్రామంలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న బీఆర్ఎస్ అభ్యర్థి, ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి‌పై గటని రాజు అనే వ్యక్తి కత్తితో దాడి చేశాడు.

Kotha Prabhakarreddy: బీఆర్‌ఎస్ ఎంపీ కొత్త ప్రభాకర్‌ రెడ్డిపై కత్తితో దాడి

సిద్దిపేట: ఎన్నికల ప్రచారంలో ఉన్న బీఆర్ఎస్ ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డిపై (BRS candidate Kota Prabhakar Reddy) కత్తి దాడి తీవ్ర కలకలం రేపింది. సోమవారం ఉదయం సిద్దిపేట జిల్లా దౌల్తాబాద్ మండలం సూరంపల్లి గ్రామంలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న బీఆర్ఎస్ అభ్యర్థి, ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి‌పై గటని రాజు అనే వ్యక్తి కత్తితో దాడి చేశాడు. ఈ ఘటనలో ఎంపీ తీవ్రంగా గాయపడ్డారు. వెంటనే గుర్తించిన కార్యకర్తలు హుటాహుటిన ప్రభాకర్ రెడ్డిని ఆసుపత్రికి తరలించారు.

ప్రభాకర్‌రెడ్డిపై దాడికి పాల్పడిన వ్యక్తిని పట్టుకుని బీఆర్‌ఎస్ కార్యకర్తలు చితకబాదారు. విషయం తెలిసిన వెంటనే ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Updated Date - 2023-10-30T14:13:37+05:30 IST