Jupalli Krishna Rao: నన్ను ఓడించడానికి ప్రగతి భవన్ నుంచి KCR డబ్బు సంచులు పంపారు

ABN , First Publish Date - 2023-10-11T16:55:49+05:30 IST

తనను ఓడించడానికి ప్రగతి భవన్ నుంచి KCR డబ్బు సంచులు పంపారని మాజీమంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత జూపల్లి కృష్ణారావు(Jupalli Krishna Rao) అన్నారు.

Jupalli Krishna Rao: నన్ను ఓడించడానికి ప్రగతి భవన్ నుంచి KCR డబ్బు సంచులు పంపారు

నాగర్ కర్నూల్ (కొల్లాపూర్‌): తనను ఓడించడానికి ప్రగతి భవన్ నుంచి KCR డబ్బు సంచులు పంపారని మాజీమంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత జూపల్లి కృష్ణారావు(Jupalli Krishna Rao) అన్నారు. బుధవారం నాడు నాగర్ కర్నూల్ జిల్లా కొల్లాపూర్‌లోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ముక్కిడిగుండం గ్రామానికి చెందిన 40మంది బీఆర్ఎస్ కార్యకర్తలకు జూపల్లి కృష్ణారావు కాంగ్రెస్ పార్టీ కండువాలు కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా జూపల్లి మీడియాతో మాట్లాడుతూ..‘‘ఎలక్షన్ కోడ్ వస్తుందని ఓటర్లను మోసం చేయడానికి బీఆర్ఎస్ నేతలు హడావుడిగా శంకుస్థాపనలు చేశారు. నిధులు లేవు, సంక్షేమ పథకాలకు మంజూరు కాగితాలు ఇస్తున్నారు. గడచిన ఐదేళ్లు ఎందుకు ఇవ్వలేదు. ఎన్నికల్లో లబ్ధి పొందడానికి డబుల్ బెడ్ రూం ఇళ్లు ఇస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక తప్పులు చేసిన అధికారులను వదిలిపెట్టం. ఉద్యోగాలు పోతాయని హెచ్చరిస్తున్నాం. ఆట మొదలైంది, ఓట్ల కోసం గ్రామాలకు వెళ్లినప్పుడు మీ బండారం బయటపెడతా. నాపై బీఆర్ఎస్ నేతలు వేసిన వాల్‌పోస్టర్లు, వాట్సాప్‌లకు వడ్డీతో సహా సమాధానం చెపుతా. ప్రజలను మోసం చేసిన బీఆర్ఎస్ నేతలను వదిలిపెట్టా’’ అని జూపల్లి కృష్ణారావు హెచ్చరించారు.

Updated Date - 2023-10-11T16:55:49+05:30 IST