Ponguleti: సత్తుపల్లి నియోజకవర్గంలో ఎలాంటి డౌట్ లేదు..
ABN , First Publish Date - 2023-11-26T14:07:10+05:30 IST
ఖమ్మం జిల్లా: సత్తుపల్లి నియోజకవర్గంలో ఎలాంటి డౌట్ లేదని, మూడు రంగుల జెండా రెపరెపలాడుతుందని పాలేరు కాంగ్రెస్ అభ్యర్థి పొంగులేటి శ్రీనివాస రెడ్డి వ్యాఖ్యానించారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆదివారం ఆయన ఖమ్మం జిల్లా, వేంసూరు మండలం, మర్లపాడులో కాంగెస్ పార్టీ నిర్వహించిన బహిరంగ సభలో మాట్లాడుతూ..
ఖమ్మం జిల్లా: సత్తుపల్లి నియోజకవర్గంలో ఎలాంటి డౌట్ లేదని, మూడు రంగుల జెండా రెపరెపలాడుతుందని పాలేరు కాంగ్రెస్ (Congress) అభ్యర్థి పొంగులేటి శ్రీనివాస రెడ్డి (Ponguleti Srinivasa Reddy) వ్యాఖ్యానించారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల (Telangana Assembly Elections) ప్రచారంలో భాగంగా ఆదివారం ఆయన ఖమ్మం జిల్లా, వేంసూరు మండలం, మర్లపాడులో కాంగెస్ పార్టీ నిర్వహించిన బహిరంగ సభలో మాట్లాడుతూ.. రాగమయి గెలుపులో అందరం భాగస్వాములం కావాలని పిలుపిచ్చారు. కాంగ్రెస్ ఆరు గ్యారెంటీలను ప్రజల వద్దకు తీసుకు వెళ్ళాలని సూచించారు. ప్రజలు కాంగ్రెస్ పార్టీని నమ్ముతున్నారని, అందరి దీవెనలతో కాంగ్రెస్ ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం చేస్తారని ఆయన అన్నారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పదికి పది స్థానాలు గెలుస్తున్నామని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ ప్రభజనం ముందు బడా బాబులు సయితం తడిచిపెట్టుకు పోతున్నారన్నారు. ఇక ఉన్నది మూడు రోజులు మాత్రమేనని.. కష్టపడి పని చేయాలని, ఐదు సంవత్సరాలు మేము సాకుతామని పొంగులేటి శ్రీనివాస రెడ్డి పేర్కొన్నారు.