Ponguleti: రాహుల్‌తో భేటీ తర్వాత అంతిమ లక్ష్యం ఏంటో చెప్పిన పొంగులేటి
ABN , First Publish Date - 2023-06-26T17:42:25+05:30 IST
తెలంగాణలో బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని గద్దె దించేందుకే కాంగ్రెస్‌లో చేరుతున్నట్లు పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి తెలిపారు. ఢిల్లీలో రాహుల్‌గాంధీ, మల్లిఖార్జున ఖర్గేతో సమావేశం అనంతరం పొంగులేటి మీడియాతో మాట్లాడారు. పదవులు ఇవ్వలేదని బీఆర్ఎస్ నుంచి బయటకు రాలేదని.. బీఆర్ఎస్‌ను గద్దె దించేందుకే బయటకు వచ్చి కాంగ్రెస్‌లో చేరుతున్నట్లు వెల్లడించారు. అయినా తనకు పదవులు ముఖ్యం కాదని.. పదవుల కంటే తనకు ఆత్మాభిమానమే ముఖ్యమని చెప్పుకొచ్చారు. ఓ దశలో ప్రాంతీయ పార్టీ పెట్టాలని ఆలోచించానని.. పార్టీ పెట్టడంపై అభిప్రాయ సేకరణ కూడా చేసినట్లు వివరించారు.
ఢిల్లీ: తెలంగాణలో బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని గద్దె దించేందుకే కాంగ్రెస్‌లో చేరుతున్నట్లు పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి తెలిపారు. ఢిల్లీలో రాహుల్‌గాంధీ (Rahul gandhi), మల్లిఖార్జున ఖర్గేతో సమావేశం అనంతరం పొంగులేటి (Ponguleti srinivas reddy) మీడియాతో మాట్లాడారు. పదవులు ఇవ్వలేదని బీఆర్ఎస్ నుంచి బయటకు రాలేదని.. బీఆర్ఎస్‌ను గద్దె దించేందుకే బయటకు వచ్చి కాంగ్రెస్‌లో చేరుతున్నట్లు వెల్లడించారు. అయినా తనకు పదవులు ముఖ్యం కాదని.. పదవుల కంటే తనకు ఆత్మాభిమానమే ముఖ్యమని చెప్పుకొచ్చారు. ఓ దశలో ప్రాంతీయ పార్టీ పెట్టాలని ఆలోచించానని.. పార్టీ పెట్టడంపై అభిప్రాయ సేకరణ కూడా చేసినట్లు వివరించారు. కొత్త పార్టీతో ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలదని భావించి కాంగ్రెస్‌లో చేరాలని నిర్ణయించుకున్నట్లు వెల్లడించారు. ఇక రాష్ట్రంలోని పరిస్థితులపై కూడా సర్వే చేయించానన్నారు. ప్రభుత్వ వ్యతిరేక ఓటు అంతా ఒకవైపే కేంద్రీకృతమైందని వెల్లడించారు.
ఇక కర్ణాటక ఫలితాల తర్వాత తెలంగాణలో కాంగ్రెస్ గ్రాఫ్ పెరిగి.. బీజేపీ పరిస్థితి దిగజారిందని పేర్కొన్నారు. ఎన్నికలు వచ్చాయంటే కేసీఆర్ కొత్త స్కీములు పెడతారని.. గారడి మాటలు చెప్పడంలో కేసీఆర్ సిద్ధహస్తులు అని చెప్పుకొచ్చారు. మూడోసారి మాయమాటలతో ముఖ్యమంత్రి కావాలని కేసీఆర్ అనుకుంటున్నారని చెప్పారు. కానీ తెలంగాణ బిడ్డలు కోరుకున్నది మాత్రం ఇంకా నెరవేరలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజలు, యువత ఏం కోరుకుంటున్నారనేది పరిశీలించాం.. తెలంగాణ బిడ్డలు ఆత్మగౌరవం కోల్పోయారని పొంగులేటి వెల్లడించారు. జూలై 2 ఖమ్మంలో జరిగే బహిరంగ సభలో రాహుల్ సమక్షంలో కాంగ్రెస్‌లో చేరుతున్నట్లు పొంగులేటి స్పష్టం చేశారు. ఈ సభకు కాంగ్రెస్ అగ్రనేతలను ఆహ్వానించినట్లు తెలిపారు.