Gangula Kamalakar: బండి సంజయ్‌కు మంత్రి గంగుల సవాల్
ABN , First Publish Date - 2023-11-29T12:33:56+05:30 IST
కరీంనగర్: భారతీయ జనతా పార్టీ నేత బండి సంజయ్ మూడోసారి ఓడిపోతారని మంత్రి గంగుల కమలాకర్ జోస్యం చెప్పారు. ఈ సందర్బంగా బుధవారం ఆయన కరీంనగర్‌లో మీడియాతో మాట్లాడుతూ సంజయ్‌కు ఓటు అడిగే హక్కు లేదన్నారు.
కరీంనగర్: భారతీయ జనతా పార్టీ నేత బండి సంజయ్ మూడోసారి ఓడిపోతారని మంత్రి గంగుల కమలాకర్ జోస్యం చెప్పారు. ఈ సందర్బంగా బుధవారం ఆయన కరీంనగర్‌లో మీడియాతో మాట్లాడుతూ సంజయ్‌కు ఓటు అడిగే హక్కు లేదన్నారు. ఎందుకంటే.. ప్రధాని మోదీ వస్తే రాష్ట్రానికి కనీసం రూపాయి నిధులైనా తెచ్చారా? అని ప్రశ్నించారు. ఎన్నికల సంఘం నిబంధనలు తుంగలో తొక్కారని విమర్శించారు. డబ్బులు, మద్యం పంచలేదని భాగ్యలక్ష్మి దేవాలయం ముందు ప్రమాణం చేస్తావా? అంటూ ఆయన బండి సంజయ్‌కు సవాల్ చేశారు. తడి బట్టలతో ఇద్దరం దేవాలయంకు వెళ్దామని.. వస్తావా? అని ప్రశ్నించారు. ఓటర్లకు మద్యం, డబ్బులు పంచుతూ మీ మనుషులే పట్టుబడ్డారన్నారు. ఎమ్మెల్యే కాకముందే ఇంత గుండాయీజమా? అంటూ గంగుల కమాలాకర్ తీవ్రస్థాయిలో బండి సంజయ్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు.