Share News

Bandi Sanjay: బీజేపీ సహకారం లేకుంటే తెలంగాణ వచ్చేదా?

ABN , First Publish Date - 2023-11-06T16:40:02+05:30 IST

మంత్రి గంగుల కమలాకర్ బాధితుల సంఘం ఏర్పాటు చేసే పరిస్థితి కరీంనగర్‌లో ఉంది. ల్యాండ్ కబ్జాలకు కేరాఫ్ గంగుల కమలాకర్, అతని అనుచరులు ఉన్నారు.

Bandi Sanjay: బీజేపీ సహకారం లేకుంటే తెలంగాణ వచ్చేదా?

కరీంనగర్: బీజేపీ సహకారం లేకుంటే తెలంగాణ వచ్చేదా? అని కరీంనగర్ బీజేపీ అభ్యర్థి, ఎంపీ బండి‌ సంజయ్ (Bandi Sanjay) ప్రశ్నించారు. కరీంనగర్ బీజేపీ అభ్యర్థిగా బండి సంజయ్ నామినేషన్ వేశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ‘‘రైతులు, నిరుద్యోగులు కోసం కొట్లాడితే నాపై ముప్పై కేసులు పెట్టారు. కరీంనగర్ స్మార్ట్ సిటీ నిధులు, నేషనల్ హైవే నిధులు నేనే తీసుకొచ్చా. గ్రామపంచాయతికి నిధులు కూడా కేంద్ర ప్రభుత్వమే ఇస్తుంది. ముఖ్యమంత్రి కేసీఆర్ (Cm kcr) మీటింగ్‌కు ప్రజలెవరూ రావడం లేదు. కాళేశ్వరం రిపోర్టు కరెక్ట్ కాదా?, కాళేశ్వరం పిల్లర్లకి పగుళ్లు వచ్చినవి నిజం కాదా?, కరీంనగర్ ఎన్నికల పలితాల కోసం యావత్ తెలంగాణ ప్రజలు ఎదురు చూస్తున్నారు. మీ కోసం కొట్లాడిన వారిని‌ అసెంబ్లీకి పంపాలి. మంత్రి గంగుల కమలాకర్ బాధితుల సంఘం ఏర్పాటు చేసే పరిస్థితి కరీంనగర్‌లో ఉంది. ల్యాండ్ కబ్జాలకు కేరాఫ్ గంగుల కమలాకర్, అతని అనుచరులు ఉన్నారు. ప్రతి ‌ఇంటి నుంచి ఛత్రపతి శివాజీ, ఝాన్సీ లక్ష్మీబాయిలు రావాలి. కరీంనగర్‌లో బీఆర్ఎస్ గెలిస్తే వచ్చే మేయర్ ఎంఐఎంకి ఇవ్వాలని ఒప్పందం కుదిరింది.’’ అని బండి సంజయ్ చెప్పుకొచ్చారు.

Updated Date - 2023-11-06T16:42:50+05:30 IST