తెలంగాణ హైకోర్టులో వైఎస్ వివేకానందరెడ్డి భార్య సౌభాగ్యమ్మ ఇంప్లీడ్ పిటిషన్

ABN , First Publish Date - 2023-02-16T22:29:41+05:30 IST

తెలంగాణ హైకోర్టు(Telangana High Court)లో వైఎస్ వివేకానందరెడ్డి (YS Vivekananda Reddy) భార్య సౌభాగ్యమ్మ (Sowubhagyamma) ఇంప్లీడ్ పిటిషన్ దాఖలు చేసింది.

తెలంగాణ హైకోర్టులో వైఎస్ వివేకానందరెడ్డి భార్య సౌభాగ్యమ్మ ఇంప్లీడ్ పిటిషన్

హైదరాబాద్: తెలంగాణ హైకోర్టు(Telangana High Court)లో వైఎస్ వివేకానందరెడ్డి (YS Vivekananda Reddy) భార్య సౌభాగ్యమ్మ (Sowubhagyamma) ఇంప్లీడ్ పిటిషన్ దాఖలు చేసింది. 2019 మార్చి 15న తెల్లవారుజాము వైఎస్ వివేకానందరెడ్డి దారుణ హత్యకు గురయ్యాడని ఆమె తెలిపింది. వైఎస్ వివేకానందరెడ్డి దారుణ హత్యపై పులివెందుల పోలీసు స్టేషన్‌లో కేసు నమోదు చేశారని చెప్పారు. కేసును సీబీఐకి బదిలీ చేయాలని హైకోర్టులో పిటిషన్ వేశామని, 2020 మార్చి11న వివేకానందరెడ్డి హత్య కేసును సీబీఐకి బదిలీ చేయాలని హైకోర్టు తీర్పు ఇచ్చిందన్నారు.

సీబీఐ దర్యాప్తు చేపట్టి నేరాభియోగపత్రాలు దాఖలు చేసిందని, సీబీఐ అధికారులు ఐదుగురిని నిందితులుగా పేర్కొన్నారని ఆమె చెప్పారు. అందులో ఏ2గా సునీల్ యాదవ్ ఉన్నాడని, సునీల్ యాదవ్, సహ నిందితులు విచారణను ప్రభావితం చేశారని చెప్పారు. కేసును ఇతర రాష్ట్రానికి బదిలీ చేయాలని సునీత సుప్రీంకోర్టుకు వెళ్లారని, 2022 నవంబర్ 29న విచారణను నాంపల్లి సీబీఐ కోర్టుకు బదిలీ చేస్తూ తీర్పు వచ్చిందన్నారు. సీబీఐ కోర్టు గత నెల విచారణకు స్వీకరించిందని, సునీల్ యాదవ్ వివేకా హత్య కేసులో కీలక పాత్ర పోషించాడని ఆమె పేర్కొన్నారు. సునీల్ యాదవ్ బెయిల్ కోసం పిటిషన్ దాఖలు చేశాడని, బెయిల్ ఇవ్వొద్దని ఇంప్లీడ్ పిటిషన్ వేసే హక్కు బాధితులకు ఉంటుందని సౌభాగ్యమ్మ అన్నారు. వైఎస్ వివేకానందరెడ్డి హత్య తర్వాత నిందితుల వల్ల తాను, తన కూతురు ఎంతో మానసిక క్షోభ అనుభవించామని ఇంప్లీడ్ పిటిషన్‌లో సౌభాగ్యమ్మ ఆవేదన వ్యక్తం చేశారు.

ఈ వార్తలు కూడా చదవండి

**************************************

కన్నా లక్ష్మీ నారాయణ రాజీనామాపై బీజేపీ స్పందన

*******************************************************

మళ్లీ రెచ్చిపోయిన మల్లారెడ్డి.. వారించిన ఆర్డీవోపై ఆగ్రహం

*******************************************

Updated Date - 2023-02-16T22:36:23+05:30 IST