Share News

Akhilesh Yadav: కేసీఆర్ ఆరోగ్య పరిస్థితిపై అఖిలేష్ యాదవ్ ఆరా

ABN , First Publish Date - 2023-12-09T15:23:35+05:30 IST

Telangana: తుంటి ఎముక ఫ్యాక్చర్‌తో యశోదా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ ఆరోగ్య పరిస్థితిపై ఉత్తర ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ ఆరా తీశారు.

Akhilesh Yadav: కేసీఆర్ ఆరోగ్య పరిస్థితిపై అఖిలేష్ యాదవ్ ఆరా

హైదరాబాద్: తుంటి ఎముక ఫ్యాక్చర్‌తో యశోదా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ (BRS Chief KCR) ఆరోగ్య పరిస్థితిపై ఉత్తర ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ (UP Former CM Akhilesh Yadav) ఆరా తీశారు. ఈ మేరకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌కు ఫోన్ చేసి పరామర్శించారు. కేసీఆర్ ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. కేసీఆర్ త్వరగా కోలుకోవాలని అఖిలేష్ యాదవ్ ఆకాంక్షించారు.


కాగా.. మాజీ సీఎం కేసీఆర్‌కు యశోద వైద్యులు విజయవంతంగా తుంటి మార్పిడి చేశారు. దాదాపు 3 గంటలకు పైగా సర్జరీ చేశారు. ఆపరేషన్ సక్సెస్ కావడంతో అనంతరం సాధారణ గదికి తరలించారు. ప్రస్తుతం వైద్యుల బృందం కేసీఆర్ ఆరోగ్యాన్ని పర్యవేక్షిస్తున్నారు. శనివారం ఉదయం వాకింగ్ స్టాండ్ సాయంతో కేసీఆర్‌ను వైద్యం బృందం నడిపించింది. కేసీఆర్ చిన్న చిన్న అడుగులు వేస్తూ ముందుకు సాగారు. ప్రస్తుతం కేసీఆర్ ఆరోగ్యం నిలకడగా ఉందని డాక్టర్లు తెలిపారు.

Updated Date - 2023-12-09T15:28:32+05:30 IST