TS News: ఆ సిగరెట్ ముక్క ప్రమాదానికి కారణం..?
ABN , First Publish Date - 2023-03-18T11:52:51+05:30 IST
ఆ రోజు రాత్రి ఏం జరిగింది.. స్వప్నలోక్ కాంప్లెక్స్‌లో ప్రమాదానికి కారణం ఏమై ఉంటుంది..? అగ్ని ప్రమాదంపై లిఫ్ట్‌బాయ్ చెబుతున్న విషయాలు అందరిని షాక్‌కు గురి చేశాయి..

హైదరాబాద్: ఆ రోజు రాత్రి ఏం జరిగింది..స్వప్నలోక్ కాంప్లెక్స్(Swapnalok Complex)లో ప్రమాదానికి కారణం ఏమై ఉంటుంది..? అగ్ని ప్రమాదంపై లిఫ్ట్‌బాయ్ చెబుతున్న విషయాలు అందరిని షాక్‌కు గురి చేశాయి. ఎంత చెప్పినా వినకుండా ఓ ఉద్యోగి సిగరెట్ అంటించి నిర్లక్ష్యంగా డస్ట్ బిన్‌లో వేశారని.. ఈ సిగరెట్ ముక్క ప్రమాదానికి కారణం అయిందని లిఫ్ట్‌బాయ్ చెపుతున్నాడు. 5వ అంతస్తు(5th Floor) లోని ఓ ఆఫీసులో ఉద్యోగి గురువారం సాయంత్రం బర్త్‌డే చేసుకున్నారు. కొందరు కేక్ తిని, సిగరెట్(Cigarette) ముట్టించారు. నేను వారి వద్దకు వెళ్లి సిగరెట్ కాల్చవద్దని మందలించాను. వారు వినలేదు. ఆ తర్వాత ఎవరో కాలిన సిగరెట్ పీకను అక్కడే ఉన్న కంప్యూటర్ క్యాటరిడ్జ్(కాటన్) డబ్బాలపై వేశారు. దాంతో మంటలు చెలరేగి, వ్యాపించాయి. నేను చెప్పేది ముమ్మాటికి నిజం. కావాలంటే సీసీ కెమెరాలు(CCTV Cameras) చెక్ చేయండి అని స్వప్నలోక్ కాంప్లెక్స్ లిఫ్ట్‌బాయ్(Lift Boy) హరిప్రసాద్ సంచలన విషయాలు బయటపెట్టాడు.