TS High Court: భైంసాలో ఆర్ఎస్ఎస్ మార్చ్‌పై పిటిషన్
ABN , First Publish Date - 2023-02-28T14:43:51+05:30 IST
భైంసా (Bhainsa)లో ఆర్ఎస్ఎస్ (RSS) మార్చ్‌పై మరోసారి హైకోర్టులో (TS High Court) పిటిషన్ దాఖలైంది. మార్చి 5న ర్యాలీ నిర్వహించేందుకు అనుమతి ఇవ్వాలని ఆర్ఎస్ఎస్
హైదరాబాద్: భైంసా (Bhainsa)లో ఆర్ఎస్ఎస్ (RSS) మార్చ్‌పై మరోసారి హైకోర్టులో (TS High Court) పిటిషన్ దాఖలైంది. మార్చి 5న ర్యాలీ నిర్వహించేందుకు అనుమతి ఇవ్వాలని ఆర్ఎస్ఎస్ పిటిషన్ దాఖలు చేసింది. నగర శారీరకోత్సవం పేరుతో ర్యాలీకి ఆర్ఎస్ఎస్ ప్లాన్ చేసింది. ఇటీవల శివాజీ జయంతి నాడు చేద్దామనుకున్న ర్యాలీకి పోలీసులు అనుమతి నిరాకరించారు. తాజాగా మరోసారి హైకోర్టులో అర్ఎస్ఎస్ పిటిషన్ వేసింది. మార్చి 5న ర్యాలీ చేసేందుకు పోలీసులు అనుమతించేలా ఆదేశాలు ఇవ్వాలని కోరింది. పిటిషన్‌పై న్యాయస్థానం విచారించనుంది.
ఇది కూడా చదవండి: Shocking Video: అబ్బ.. ఎంత పెద్దదో.. అంటూ బండిని ఆపి మరీ ఖడ్గ మృగాన్ని ఫొటోలు తీశారు.. అంతే మరుక్షణంలోనే ఊహించని సీన్..!