Telangana Police: హోంగార్డ్ రవీందర్ మృతితో పోలీస్ అధికారుల అప్రమత్తం

ABN , First Publish Date - 2023-09-08T11:04:29+05:30 IST

కంచన్ బాగ్‌లోని అపోలో డీఆర్డీవో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న హోంగార్డ్ రవీందర్ మృతి చెందారు. హోంగార్డు మృతి నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న హోంగార్డుల విషయంలో పోలీసు అధికారులు అప్రమత్తమయ్యారు. హోంగార్డులెవరు రవీందర్ కుటుంబానికి మద్దతుగా వెళ్లకుండా పోలీసలు చర్యలు తీసుకుంటున్నారు.

Telangana Police: హోంగార్డ్ రవీందర్ మృతితో పోలీస్ అధికారుల అప్రమత్తం

హైదరాబాద్: కంచన్ బాగ్‌లోని అపోలో డీఆర్డీవో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న హోంగార్డ్ రవీందర్ (Homegaurd Ravinder) మృతి చెందారు. హోంగార్డు మృతి నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న హోంగార్డుల విషయంలో పోలీసు అధికారులు అప్రమత్తమయ్యారు. హోంగార్డులెవరు రవీందర్ కుటుంబానికి మద్దతుగా వెళ్లకుండా పోలీసలు చర్యలు తీసుకుంటున్నారు. హోం గార్డులందరూ డ్యూటీలో ఉండేలా చూసుకోవాలని సీఐలకు ఉన్నతాధికారుల ఆదేశాలు జారీ చేశారు. డ్యూటీలో లేని హోంగార్డులు తప్పనిసరిగా పోలీస్ స్టేషన్‌లో ఉండాలని ఆదేశించారు. హోంగార్డులు అందరూ అందుబాటులో ఉండేలా ఇన్స్పెక్టర్లు చర్యలు తీసుకోవాలన్నారు. లా అండ్ ఆర్డర్ లో పనిచేసే వారు సమ్మెకు పూనుకుంటే విధులనుంచి బహిష్కరణకు గురవుతారని.. ఎవరైనా విధులకు రాకుండా ఉంటే వాళ్లను తొలగించాల్సి వస్తుందని పోలీసు అధికారులు హెచ్చరికలు జారీ చేశారు.


కాగా.. అపోలో డీఆర్డీవో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న హోంగార్డ్ రవీందర్ ఈరోజు(శుక్రవారం) తెల్లవారుజామున మృతి చెందారు. 70% కాలిన గాయాలతో ఉన్న రవీందర్‌కు వైద్యులు వెంటిలేటర్‌పై ఉంచి చికిత్సను అందించారు. అయితే నిన్న ఆయన పరిస్థితి మరింత విషమంగా మారింది. నేటి తెల్లవారుజామున రవీందర్ తుదిశ్వాస విడిచారు. పోలీసులు డీఆర్డీవో వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఈ క్రమంలోనే డీఆర్డీవో వద్ద హైటెన్షన్ చోటు చేసుకుంది. మరోవైపు డీఆర్డీవో అపోలో వద్ద హోంగార్డుల ఆందోళన కొనసాగుతోంది. ఇప్పటికే అనేక మంది హోంగార్డులు విధులు బహిష్కరిస్తున్నారు. రవీందర్ కుటుంబాన్ని ఆదుకోవాలని హోంగార్డులు డిమాండ్ చేస్తున్నారు.

Updated Date - 2023-09-08T11:04:29+05:30 IST